జబ్బార్ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్, తాజాగా వి కావేరి ట్రావెల్స్.. ఈ సంస్థలకు చెందిన బస్సుల కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బుగ్గిపాలు అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రయాణీకుల ప్రాణాలతో తీశాయి. తాజాగా కర్నూలులో జరిగిన వేమూరి కావేరీ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా ప్యాసింజర్లు కాలిబూడిదై పోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో ఎక్కువ మంది యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నారు. అయితే, బస్సు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి? వాటి నుంచి తప్పించుకుని ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి ఈ మధ్య వస్తున్న స్లీపర్, లగ్జరీ బస్సులు చాలా ఎత్తులో ఉంటున్నాయి. వీటిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా అంతే ఎత్తులో ఉంటాయి. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అంత మంది అక్కడికి చేరుకుని దూకడం చాలా కష్టం. అంత ఎత్తు నుంచి దూకినా కాళ్లు చేతులు విరిగిపోతాయి. ప్రాణాలు కూడా పోతాయి. కంగారులో ఒకరి మీద ఒకరు పడే అవకాశం ఉంటుంది. ఆ ఎమర్జన్సీ ఎగ్జిట్స్ దగ్గర కనీసం నిచ్చెన కూడా ఉండదు. అలాగే స్లీపర్ బస్సులో ఒక మనిషి నడిచేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. ప్రమాదం సమయంలో గందరగోళం ఏర్పడుతుంది. మంటల సమయంలో పొగలు కమ్మేస్తా. ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. కొందరు అక్కడే స్ప్రహ కోల్పోతారు. దానివల్ల మంటల్లో చిక్కుకుపోతారు. తీవ్ర ప్రాణ నష్టం సంభవిస్తుంది.
బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సేఫ్ గా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది.
బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో దట్టమైన పొగ వ్యాపిస్తుంది. ఆ సమయంలో మీరు కిందికి వంగి, ముక్కు, నోటికి కర్చీఫ్ ను అడ్డుగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
మెయిన్ డోర్ లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను కనిపెట్టాలి. రెడ్ హ్యాండిల్స్ ఉన్న డోర్లను వెంటనే ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఓపెన్ కాకపోతే తలుపును గట్టిగా తన్ని ఓపెన్ చేయాలి. రెడ్ కలర్ లోని సుత్తెలు ఉన్న కిటికీలను వెంటనే పగలగొట్టాలి. ఇతరులు కదిలే వరకు వేచి చూడకుండా దగ్గర ఉన్న ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్లాలి. ఎత్తుగా ఉందని భయపడకూడదు. లోపల ఉంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.
వీలుంటే పిల్లలు, వృద్ధులు, గాయపడిన వారికి సాయం చేయండి. బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్లకూడదు.
బస్సు లోపలి నుంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం 50 మీటర్ల దూరం వెళ్లండి. బస్సు ఫ్యూయెల్ ట్యాంక్ పేలిపోయే అవకాశం ఉంటుంది.
బస్సులో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అత్యవసర నెంబర్లు అయిన 100, 101, 112, 911లో ఏదో ఒకదానికి కాల్ చేయండి.
బస్సు అగ్ని ప్రమాదం సమయంలో విమానంలో పాటించే సూచనలు పాటించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. నిజానికి విమానాలు బయల్దేరే సమయంలో ఇన్‌స్ట్రక్షన్స్ చెబుతారు. ఏం జరిగితే ఎలా చేయాలో వివరిస్తారు. అలాగే, బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఎమర్జెన్సీ డోర్లు ఎటువైపు ఉన్నాయి? ప్రయాణికులు ఏం చేయాలనే అనౌన్స్ మెంట్ తప్పకుండా ఇవ్వాలి. కానీ, అవేవీ బస్సుల్లో ఉండవు. ఈ విషయంలో జపాన్, చైనా లాంటి దేశాలు ముందున్నాయి. ఈ తరహా విధానం మన దేశంలోనూ ఉండాలి.
Read Also: కర్నూలు జిల్లాలో ఘోరం ప్రమాదం.. ట్రావెల్ బస్సు దగ్దం, 20 మందికి పైగా మృతి?