Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా రష్మిక ప్రేక్షకుల ముందుకు వస్తు వరుస విజయాలను సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల వ్యవధిలోనే రెండు సూపర్ హిట్ సినిమాలను రష్మిక అందుకున్నారు.
ఇదిలా ఉండగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammuraa) కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా.. జగపతిబాబు మాట్లాడుతూ డియర్ కామ్రేడ్ (Dear Comrade)సినిమాని ఫేవరెట్ కదా అంటూ అడగడంతో వెంటనే రష్మిక మాట్లాడుతూ గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నేను డియర్ కామ్రేడ్ సినిమాలో నటించానని తెలిపారు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అంటూ ఈ సందర్భంగా రష్మిక డియర్ కామ్రేడ్ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా డియర్ కామ్రేడ్ సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పడంతో అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఈ సినిమా గీతగవిందం సినిమాతో పోలిస్తే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ రష్మిక మాత్రం తనకు చాలా స్పెషల్ అని చెప్పడంతో బహుశా వీరిద్దరి ప్రేమాయణం ఈ సినిమా నుంచి మొదలైంది కాబోలు అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ అంటూ రష్మిక మాట్లాడారని అభిమానులు భావిస్తున్నారు. ఇలా ఈ రెండు సినిమాల తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన ఎక్కడ స్పందించలేదు.
ఉదయపూర్ ప్యాలెస్ లో..
ఇక ఇటీవల ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారని త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని తెలుస్తోంది. రష్మిక విజయ్ దేవరకొండ 2026 ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోందని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు అధికారికంగా వెలబడలేదు. రష్మిక విజయ్ దేవరకొండ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇక వీరిద్దరూ డియర్ కామ్రేడ్ తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టం అవుతుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Sankranthiki Vasthunam: మరో అవార్డును కైవసం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం..బెస్ట్ ఫీచర్ ఫిలింగా !