BigTV English
Advertisement

The Girlfriend Movie : డైరెక్టర్ గారు… వర్క్ షాప్ చేయలేదా ?

The Girlfriend Movie : డైరెక్టర్ గారు… వర్క్ షాప్ చేయలేదా ?

Trolls on Director Rahul Ravindran: ఓ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అంటే.. ఆయన చేసే ఫస్ట్ పని ఏంటంటే… వర్క్ షాప్. సినిమాను ఏ కథపై చేస్తున్నాం ? దానికి కావాల్సినవి ఏంటి ? అవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ? అనే అవగహన డైరెక్టర్‌కు ఉండాలి. అందుకే వర్క్ షాప్ చేస్తారు. ఇప్పుడు ఈ వర్క్ షాప్ గురించి ఎందుకు అంటే… ఈ రోజు ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ రిలీజ్ అయింది. వరుసగా 6 సార్లు 100 కోట్ల సినిమాలను చేసిన రష్మిక మందన్నా దీనిలో లీడ్ రోల్. దీనికి చిలాసౌ లాంటి మూవీని డైరెక్ట్ చేసిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఈ సినిమా కాన్సెప్ట్ బానే ఉంది. క్లైమాక్స్ బానే ఉంది. కానీ, ఓ విషయంలో మాత్రం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌పై విమర్శలు వస్తున్నాయి. వర్క్ షాప్ చేయలేదా డైరెక్టర్ గారు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. ఆ వర్క్ షాప్ ఏంటి? సినిమాలో ఏది నిరుత్సహపరిచింది అనేది ఇప్పుడు చూద్దాం.


పీజీ స్టూడెంట్స్ ఎలా ఉంటారో తెలియదా?

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్టోరీ అంటే.. ఓ టిపికల్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి… ఇండిపెండెంట్‌గా బతకాలి అనుకునే అమ్మాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో.. పీజీ చదివే టైంలో అది జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. కాన్సెప్ట్‌ బాగుంది. ప్రస్తుతం సమాజంలో మన చూట్టు జరుగుతున్న నిజమైన సంఘటనలు. ఈ కథ అందరికి రీచ్‌ అవుతుంది అందులో సందేహం లేదు. గర్ల్‌ఫ్రెండ్‌ టీజర్‌, ట్రైలర్‌ చూసిన ఆడియన్స్‌ కూడా అవే అభిప్రాయాలు వచ్చాయి. స్టోరీ, నటీనటుల సెలక్షన్‌ అంత బాగానే ఉంది. కానీ, కథని నడిపించడం.. రియలిస్టిక్‌ ఉండేలా చూపించడంతో దర్శకుడు రాహుల్‌ తడబడ్డాని అనిపిస్తుంది. దీనికి కొన్ని సీన్స్‌ ఉదాహరణ. కాలేజీ స్టూడెంట్స్‌ మధ్య లవ్‌.

హీరోహీరోయిన్లే ముఖ్యం కాదు

అది కూడా పోస్ట్‌ గ్రాడ్యూవేషన్‌లో. పీజీ స్టూడెంట్స్‌ అంటే చాలా మెచ్యురిటీతో పాటు కొన్ని సందర్భాల్లో తొందరపాటు కూడా ఉంటుంది. అది హీరోలో చూపించారు. అలాగే హీరోయిన్‌ని కూడా మెచ్యురిటీగా చూపించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే హీరోహీరోయిన్ల పాత్రలే ముఖ్యంగా కాదు వారితో ఉండే ఫ్రెండ్స్‌ కూడా ముఖ్యమే. వారు కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ, రాహుల్‌ ఇక్కడే తప్పు చేశాడనిపిస్తోంది. ఇందులో పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ చేసే హీరో, హీరోయిన్‌తో బ్రేకప్‌ తర్వాత స్నేహితులతో మాట్లాడుతుంటారు. అక్కడ హీరో ఫ్రెండ్స్‌ మెచ్చురిటీగా కనిపించలేదు. వారి చెప్పే డైలాగ్స్‌ కూడా ఏదో ఇంటర్‌, స్కూలింగ్ స్టూడెంట్స్‌ చెప్పినట్టుగా ఉంది. వారి లుక్‌ కూడా పీజీ స్టూడెంట్స్‌లా కనిపించడం లేదు. ఏదో ఇంటర్‌ విద్యార్థుల్లా కనిపించారు. ఒక సినిమాకు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవ్వాలంటే ప్రతి ఫ్రేం ఇంపార్టెంటే.


Also Read: Gouri Kishan: నటిపై బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. గౌరీ కిషన్‌ని అభినందించిన చెన్నై ప్రెస్‌క్లబ్‌

ఉస్మానియా కాలేజీలో చూసి రావాల్సింది..

కేవలం హీరోహీరోయిన్ల మాత్రమే పర్ఫెక్ట్‌ చూపిస్తే చాలదు, వారు కనిపించే ప్రతి సీన్‌ కూడా పర్ఫెక్ట్‌ గా ఉండాలి. నటీనటులు కూడా సీన్‌ కి, పాత్రకు పర్ఫెక్షన్‌ తీసుకురావాలి. కానీ, ఈ సీన్‌ లో స్టూడెంట్స్‌ని చూపించడంలో రాహుల్‌ ఫెయిల్‌ అయ్యాడు. పైగా ఆయన ఓ సందర్భంగా పీజీ విద్యార్థులంటే వారికి చాలా మెచ్చురిటీ ఉంటుంది, వారికి మేము చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రొఫెసర్‌గా స్వయంగా రాహుల్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. అక్కడైన డైరెక్టర్‌ ఆలోచన రాలేదా అని విమర్శిస్తున్నారు. అందుకే ఈ విషయంలో డైరెక్టర్‌ గ్రౌండ్‌ వర్క్‌ చేయాల్సింది అని సలహాలు ఇస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ.. నిజాం కాలేజీల్లో కొన్ని రోజులు వర్క్ షాప్ చేసి ఉంటే బాగుండు అంటున్నారు. ఎందుకంటే ది గర్ల్‌ఫ్రెండ్‌ మూవీలో చూపించిన కాలేజీ కూడా చాలా పెద్దగా ఉంది. కాబట్టి రాహుల్‌ స్టూడెంట్స్‌ చూపించిన విధానం కాస్తా వర్క్‌ షాప్‌ చేసుంటే బాగుండని అభిప్రాయపడుతున్నారు.

Related News

Ajith Kumar: విజయ్‌తో వైరం.. ఎట్టకేలకు నోరువిప్పిన అజిత్‌

Akhanda Thaandavam Promo: అఖండ తాండవం ప్రోమో వచ్చింది… ఇక శివతాండవమే!

Harish Shankar: వార్తలన్నీ అబద్ధాలేనా, త్రివిక్రమ్ తో హరీష్ ఇంత క్లోజ్ గా ఉంటాడా?

Mirnalini Ravi: లగ్జరీ కారు కొన్న వరుణ్‌ తేజ్ హీరోయిన్‌.. ఆ కారు కొన్న తొలి భారతీయ నటిగా ఘనత!

Rashmika -Vijay’s wedding: పెళ్లి పనులలో బిజీగా రష్మిక.. పెళ్లి వేదిక అక్కడే?

Rukmini Vasanth: రుక్మిణి పేరుతో మోసం… అలర్ట్ చేసిన నటి.. చర్యలు తప్పవంటూ!

Rashmika Mandanna: విజయ్ తో ఆ సినిమా చాలా ప్రత్యేకం..  అసలు విషయం చెప్పిన రష్మిక!

Big Stories

×