Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పటికప్పుడు వినూత్నమైన టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ నడుస్తోంది. తొమ్మిదవ సీజన్లో భాగంగా ఎనిమిదవ వారం మొదలైంది. అందులో తాజాగా ఫుల్ ఆఫ్ ఫన్ అంటూ ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్లు అనిపిస్తోంది.. అందులో భాగంగానే 53వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేయగా.. అందులో ఇమ్మానుయేల్ డైరెక్టర్గా మారి చేసిన అల్లరి అందరి చేత నవ్వులు పూయించింది. ఇకపోతే హీరోయిన్ గా రీతూ చౌదరి.. హీరోగా డెమోన్ పవన్ మధ్య సృష్టించిన అల్లరి అటు హౌస్మేట్స్ ను మాత్రమే కాదు ఇటు ఆడియన్స్ ని కూడా మెప్పించింది అని చెప్పవచ్చు..
ప్రోమో మొదలవగానే డైరెక్టర్ గా మారిన ఇమ్ము.. వర్షంలో గొడుగులు పట్టుకొని నిలబడిన రీతూ చౌదరి, డెమోన్ పవన్ లతో మాట్లాడుతూ.. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను వాటికి ఆన్సర్ చేసుకుంటూ ఒకరికొకరు దగ్గరగా రావాలి. అంటూ ఇమ్మానుయేల్ కామెంట్లు చేస్తారు. ఓకే యాక్షన్.. డెమోన్ నీకు ఇష్టమైన అమ్మాయి ఫస్ట్ లెటర్ ఏంటి?అని అడగ్గా.. ఏ అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత రీతు నీకు ఇష్టమైన అబ్బాయి మొదటి లెటర్ ఏంటి ? అని అడగ్గా ఆమె పి అని సమాధానం చెబుతుంది. ఆ తర్వాత ఇమ్ము నీకు నచ్చిన అమ్మాయి సెకండ్ లెటర్ ఏంటి అని ప్రశ్నించగా.. పవన్ ఎమ్ అని తెలిపారు. ఇక రీతు చౌదరిని నీకు ఇష్టమైన అబ్బాయి సెకండ్ లెటర్ ఏంటి అని ప్రశ్నించగా.. ఆమె చెప్పకుండా సైలెంట్ గా నిలుచొని ఉంటే.. ఏంటే చదువుకోలేదా అంటూ కామెడీ పండించారు ఇమ్మాన్యుయేల్.
ఫస్ట్ నేను యాక్షన్ అనగానే ఇద్దరు మధ్యలోకి రావాలి. అని చెబుతుండగానే పవన్ రొటేట్ అవుతూ చెబుతాం అని చెప్పగా.. దానికి ఇమ్మానుయేల్ ఇంకెందుకు ఎత్తుకొని తిరుగు.. ఎక్కువ వేషాలు వేసావ్ అంటే నిన్ను తీసేసి సుమన్ శెట్టి ను హీరోగా పెడతాను అంటూ చెప్పడంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. తర్వాత ఇద్దరినీ ఒకేచోటకు రమ్మని కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకోమని డైరెక్టర్ గా మారి చెబుతుండగా ఆమె సిగ్గుతో నవ్వుకుంది. గట్టి గట్టిగా నవ్వుతుంటే ఏయ్ పిచ్చిదానా కామెడీ సినిమా చేయట్లేదు.. లవ్ సినిమా చేస్తునామ్.. ఎవర్రా దీన్ని హీరోయిన్గా పెట్టింది.. నవ్వుతోంది అంటూ ఇమ్మాన్యుయేల్ తన డైలాగ్స్ తో అందరిని కడుపుబ్బా నవ్వించారు. మొత్తానికి అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో భారీ వైరల్ గా మారుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పాపం రీతూ చౌదరి బిత్తర చూపులు చూస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
also read:Akhanda 2: అప్పుడు పండిట్స్.. ఇప్పుడు సిస్టర్స్.. తమన్ మాస్టర్ ప్లాన్ వెనుక కారణం?