Yash Toxic: కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ కేజిఎఫ్ సినిమా ద్వారా యశ్(Yash) పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.. ఇకపోతే ప్రస్తుతం యశ్ టాక్సిక్ (Toxic)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాని ఉగాది పండుగ సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 19వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం ఇదివరకే వెల్లడించారు.
ఇకపోతే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని తద్వారా సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. ఇలా ఈ సినిమా వాయిదా పడుతున్న నేపథ్యంలో అదే రోజున అడవి శేష్ డెకాయిట్ విడుదల కాబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఈ వార్తలపై చిత్రబృందం స్పందించారు. టాక్సిక్ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. ఈ సినిమా యధావిధిగా మార్చి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలిపారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో జనవరి నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇలా ఈ సినిమా విడుదల వాయిదా పడలేదని, ఉగాది పండుగ సందర్భంగా విడుదల కాబోతోందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das)దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
రావణాసురుడిగా యష్..
ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో యశ్ కు జోడిగా కియార అద్వానీ(Kiara Advani) నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో నయనతార (Nayanatara)కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ద్వారా పెద్దలకు అద్భుతమైన సందేశాన్ని అందించబోతున్నామని గతంలో యష్ ఒక సందర్భంలో వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ కూడా తానే సూచించానని ఈయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. యశ్ నటించిన కే జి ఎఫ్ 2 తరువాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.