BigTV English
Advertisement

Baahubali The Epic Twitter Review : ‘బాహుబలి ది ఎపిక్’ ట్విట్టర్ రివ్యూ..మళ్లీ హిట్ కొట్టేసిందా..?

Baahubali The Epic Twitter Review : ‘బాహుబలి ది ఎపిక్’ ట్విట్టర్ రివ్యూ..మళ్లీ హిట్ కొట్టేసిందా..?

Baahubali The Epic Twitter Review : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి. ఈ మూవీ రెండు పార్టీలుగా రిలీజ్ అయ్యి రెండు కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ రెండు పాటలు కలిపి ఒక సినిమాగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో సినిమా మళ్లీ థియేటర్లోకి రాబోతుందని ప్రకటించారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్లు, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఏ మూవీ ఈసారి కూడా అంతకుమించి కలెక్షన్ను రాబడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలోకి వచ్చేసిన ఈ సినిమా ఎలాంటి టాక్ని అందుకుంది.. జనాల రెస్పాన్స్ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించిన చిత్రం బాహుబలి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి వంటి తదితరుల నటులు కీలక పాత్రలో నటించారు. బాహుబలి ది ఎపిక్‌కు సంబంధించి నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో అక్టోబర్ 30వ తేదీ ఉదయం నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి.. ఇప్పటికే ట్విట్టర్ లో నెటిజన్లు సినిమా ఎలా ఉందో ట్వీట్స్ చేస్తున్నారు. మళ్లీ రాజమౌళి హిట్ కొట్టాడా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఇక ఆలస్యం లేకుండా జనాల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం..

బాహుబలి సినిమా మరోసారి చూడటం హ్యాపీగా ఉంది. ఈ కళాఖండం స్కేల్, ఎమోషన్, సినిమాటిక్ ఫోర్స్ ఇప్పటికీ ప్రతి ఫ్రేమ్‌లోనూ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. బాహుబలి విడుదలై 10 సంవత్సరాలు అయ్యింది.. అయిన ఇప్పటికీ అదే సీన్లు కళ్లు ముందు కళ్ళ ముందు కదులుతున్నాయి. సూపర్ ఉంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.


బాహుబలి మూవీ మర్చిపోలేరు.. ఐమ్యాక్స్‌ని సరిగ్గా ఆప్టిమైజ్ చేశారు. ఇమేజ్, సౌండ్ క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. డబ్బు సంపాదించడానికి చేసే చౌకైన రీ రిలీజ్‌లా కనిపించడం లేదు.. ప్రపంచాన్ని ఏలే మూవీ లాగా మళ్లీ అనిపించడం విశేషం. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ఓ నేటిజన్ ట్వీట్ చేశారు..

ఎపిక్ బాహుబలి రీ రిలీజ్ కోసం జీరో నన్ను హైప్ చేసింది. సినిమా డింట్‌కి ఎమోషనల్ కనెక్ట్ బలంగా ఉందని అనుకున్నాను.. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పెద్దగా నచ్చలేదు. ఇప్పుడు ఆ బిజిఎం నాకు బాగా నచ్చేసింది అని మరో నెటిజన్ ట్విట్ చేశారు..

https://twitter.com/RGVaditya/status/1983800893461164473?t=NachcacqZdZdNvpTj5EBVQ&s=19

బాబు కుమారుడు గౌతమ్ కూడా ఈ సినిమాని మరోసారి థియేటర్లలో చూశాడు.. బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ చెప్పాడు.. గౌతమ్ మాట్లాడుతూ.. బాహుబలి మూవీ అమేజింగ్ గా ఉంది. బిగ్ దీనిపై చూడ్డం నిజంగా క్రేజీగా ఉంది. మనం చూస్తున్నంత సేపు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా గురించి ఇంతకన్న ఏమి చెప్పలేను.. చూస్తున్నంత సేపు నాకు వేరే లోకాన్ని చూసినంత అనుభూతి కలిగించారు అని రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు ఇంటర్నేషనల్ లెవెల్ లో చేశారు అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు గౌతమ్.. ప్రస్తుతం గౌతమ్ ఇచ్చిన రివ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

పదేళ్లు అయిన ఇంకా అదే ఎమోషన్, అలాంటి మ్యాజిక్. ఒక్కసారిగా ఆ రిలీజ్ డే మెమొరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఈ రికార్డు బ్రేక్ చేయడం జక్కన్నకు ఒకటే సాధ్యం.. మళ్లీ చూస్తుంత సేపు వేరే ప్రపంచంలో ఉన్నట్లు ఉంది.. చాలా కొత్తగా ఉంది. బాహుబలి ఎపిక్ ను థియేటర్లలో ఖచ్చితంగా చూడాలి అని ట్వీట్ చేశారు.

రాజమౌళి లెజెండరీ డైరెక్టర్, ఈయన సినిమాలకు పేరు పెట్టనవసరం లేదు ఇవే మాటలు ప్రస్తుతం జనాలు నుంచి వినిపిస్తున్నాయి. బాహుబలి ది ఎపిక్ మూవీ మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకుందని రెస్పాన్స్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజే మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏ మాత్రం కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి..

Related News

Bison Movie Review : బైసన్ మూవీ రివ్యూ

Thamma Movie Review : థామా మూవీ రివ్యూ

Thamma Twitter Review: ‘థామా’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టిందా..?

KRamp Movie Review : కె ర్యాంప్ రివ్యూ

K ramp Twitter Review: ‘కే ర్యాంప్’ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరంకి మరో హిట్ పడినట్లేనా..?

Dude Movie Review: ‘డ్యూడ్’ మూవీ రివ్యూ: సారీ డ్యూడ్ ఇట్స్ టూ బ్యాడ్

Telusu kada Review : ‘తెలుసు కదా’ రివ్యూ : కష్టం కదా

Big Stories

×