Hyderabad Politics: రాజకీయాలు వేరు.. ఫ్యామిలీ రిలేషన్స్ వేరు.. ఈ రెండింటినీ ఒకే గాడిన కట్టరాదని చాలామంది రాజకీయ నేతలు సమయం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. లేటెస్టుగా మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత వచ్చారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. అన్న ఒక పార్టీలో.. తమ్ముడు మరొక పార్టీలో ఉండడం చూస్తుంటాము. తెలంగాణ విషయానికి వద్దాం.. రీసెంట్‌గా మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మరణించారు. ఈ విషయం తెలియగానే వివిధ పార్టీల నేతలు ఆయనకు నివాళులు అర్పించి, తమ సానుభూతి తెలిపారు. అందులో బీఆర్ఎస్ నేతలేకాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి చెందినవారు ఉన్నారు.
ఆ రోజు ఎమ్మెల్సీ కవిత రాలేదు. హరీష్‌రావుతో విభేదాల కారణంగానే రాలేదని చాలామంది అనుకున్నారు. మూడు రోజుల తర్వాత గురువారం ఉదయం మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి కుటుంబసభ్యులతో వచ్చారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులను కవిత పరామర్శించారు. కాసేపు ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడారు. సత్యనారాయణ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
కుటుంబసభ్యులకు కవిత పరామర్శ
హరీష్‌రావుపై ఆరోపణలు గుప్పించిన తర్వాత కవిత ఆయన ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో హరీష్‌రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు అవినీతి మరక వెనుక హరీష్‌రావు-సంతోష్‌రావు ప్రధాన కారణమని ఆరోపించారు. వారిద్దరు అవినీతి చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం జరుగుతుండగా హరీష్‌రావు లండన్ వెళ్లారు.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారంలో నేతలు బిజీ
కవితపై నేరుగా స్పందించడానికి ఆయన ఆసక్తి చూపలేదు హరీష్‌రావు. తాను ఉద్యమం నుంచి ఉన్నారని, తన ప్రస్థానం తెరిచిన పుస్తకంగా వర్ణించారు. తనను, పార్టీపై కొందరు ఆరోపణలు చేశారని, అవి ఎందుకు చేశారో తెలీదన్నారు. అది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతకు మించి ఆయన ఒక్కమాట కూడా అనలేదు. హరీష్‌రావు తండ్రి మరణం తర్వాత కవిత ఆయన ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి కూడా. దీనిపై రాజకీయ పార్టీల నేతలు తలో విధంగా చర్చించుకోవడం మొదలైంది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కల్వకుంట్ల కవిత
రెండు రోజుల క్రితం మృతి చెందిన హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు
హరీష్ రావును కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత pic.twitter.com/twHEsQCkVr
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2025