Today Gold Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1910 తగ్గి రూ.1,20,490 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధరపై రూ. 1750 తగ్గి.. రూ.1,10,450 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు తగ్గడానికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రపంచ మార్కెట్లో డాలర్ బలహీన పడడం, పెట్టుబడిదారులు బంగారంపై లాభాల స్వీకరణకు మగ్గు చూపించడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,20,490 వద్ద కొసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,450 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,20,490 వద్ద ట్రేడ్ అవుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,450 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,20,490 వద్ద కొనసాగుతోంది.
రైజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,600 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,20,640 వద్ద ట్రేడ్ అవుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,20,490 కి చేరుకుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,450 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,20,490 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,65,000 కి చేరుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,51,000 వద్ద కొనసాగుతోంది.
Also Read: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, వచ్చే వారం బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ మార్పిడి విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను ప్రభావితం చేయనున్నాయి. డిమాండ్ పెరిగితే ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.