Sankranti -2026: మిగతా భాష ఇండస్ట్రీల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. చిన్న పెద్ద ప్రతి ఒక్క హీరో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుంటారు. అందుకే తమ సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి అనూహ్యంగా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మరి అది త్యాగమో లేక ఇతర సినిమాల ఫలితమో తెలియదు కానీ అలా అప్పుడప్పుడు తమ అభిమాన హీరో సంక్రాంతికి వస్తున్నారని తెలిసి సడన్గా తప్పుకుంటే మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఒక యంగ్ హీరో సంక్రాంతి 2026 బరి నుండి తప్పుకోబోతున్నారని తెలిసి.. అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వచ్చే ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ టార్గెట్ గా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) మన శంకర్ వరప్రసాద్ గారు, రవితేజ (Raviteja ) RT76, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అనగనగా ఒక రాజు, ప్రభాస్ (Prabhas)ది రాజా సాబ్, విజయ్ దళపతి (Vijay thalapathy) జననాయగన్ ఇలా పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేస్ నుండి నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలు కారణం ఏమిటంటే.. సాధారణంగా పొంగల్ అంటేనే థియేటర్ల సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. పైగా ఈ పొంగల్ బరిలో దిగుతున్న రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ తీసుకుంది అంటే మాత్రం ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య కారణంగానే ఇప్పుడు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా వాయిదా పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే…విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీడెడ్ లేదా ఆంధ్ర ఏరియాలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ హక్కులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాం ఏరియాలో దిల్ రాజు తీసుకునే అవకాశం ఉండగా.. అటు అనగనగా ఒక రాజు చిత్రానికి కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఒకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కాబట్టి ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించాలో తెలియక ఘర్షణకు తావు ఇవ్వకుండా ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ వాయిదాపై ఇంకా సితార అధికారికంగా ప్రకటించలేదు.
అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే.. నవీన్ పోలిశెట్టి హీరోగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్గా వస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.
విజయ్ దళపతి జననాయగన్ సినిమా విషయానికొస్తే.. తమిళ్ భాష రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే నటించగా
..బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్ , ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ: Mega 158: అంతా ఫేక్ న్యూస్… చిరు మూవీపై మరో న్యూస్