BigTV English

Gayathri Gupta: నేను పాన్ సె**క్సువల్.. నాకు జెండర్ తో పని లేదు

Gayathri Gupta: నేను పాన్ సె**క్సువల్.. నాకు జెండర్ తో పని లేదు

Gayathri Gupta: గాయత్రి గుప్తా ఈ పేరు ఒకప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నాను అనేవాళ్ళు కొందరు అయితే కొత్త కొత్త వివాదాలు మాటల ద్వారా సృష్టించుకోవడం మరికొందరి టాలెంట్. అది గాయత్రి గుప్తాలో బాగా ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. టాలీవుడ్ కాంట్రవర్సీ యాక్టర్స్ లో  గాయత్రి గుప్తా మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పొచ్చు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి ఫేమస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత జంధ్యాల రాసిన ప్రేమ కథ, సీత ఆన్ రోడ్, బుర్రకథ, కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది.


 

ఇక సినిమాల్లో వచ్చిన పేరును వివాదాలలో పోగొట్టుకుంది. ఇంకా చెప్పాలి అంటే వివాదాల ద్వారానే మరింత ఫేమస్ అయ్యింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చాలా బోల్డ్ గా మాట్లాడి అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.  అదే కాకుండా బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా యాజమాన్యంతో ఒక రాత్రి గడపాలని, అలా తనను గడపమని చాలా వేధించారని సంచలమైన వ్యాఖ్యలు చేసి మరింత రచ్చ చేసింది. ఆ విమర్శల తర్వాత అమ్మడిని ఎవరు పట్టించుకోలేదు.


 

ఇక ఇవన్నీ పక్కన పెడితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని చెప్పుకొచ్చింది. ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపుతూ చికిత్స కోసం డబ్బులు కావాలని కూడా కోరింది. నెలకు ఒకటి రెండు ఇంజక్షన్స్ చేయించుకోవాలని, వాటికి లక్షల్లో ఖర్చు అవుతుందని తనపై దయ ఉంచి సహాయం చేయవలసిందిగా ఆమె సోషల్ మీడియాలో కోరింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఆమె ఎక్కడా కనిపించింది లేదు.

 

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో గాయత్రి మరో బాంబు పేల్చింది. తాను పాన్ సెక్సువల్ అని చెప్పుకొచ్చింది. పాన్ సెక్సువల్ అంటే ఏ జెండర్ పైన అయినా కోరికలు కలగడం. సాధారణంగా అమ్మాయిలు.. అబ్బాయిలను చూసి ఆకర్షితులు అవుతారు. అబ్బాయిలకు.. అమ్మాయిల మీద కోరికలు పుడతాయి. ఇది సహజం. అయితే ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు.. అబ్బాయిల మీద.. అమ్మాయిలకు అమ్మాయిల మీద కోరికలు పుడుతున్నాయి. ఒకే జెండర్ వాళ్లే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ, గాయత్రి లాంటి పాన్ సెక్సువల్ వాళ్లు.. జెండర్ తో సంబంధం లేకుండా.. ఆడ, మగ, ట్రాన్స్ జెండర్ ఎవరిపైన అయినా ప్రేమ పుడుతుంది. వారితో  శృంగారం చేయగలరు. వారికి ఎవరిని చూసినా కోరిక కలుగుతుంది. అలాంటివారికి జెండర్ ముఖ్యం కాదు. ఆ వ్యక్తి ఎలాంటివారు..? ప్రేమను పంచుతున్నారా..? సుఖం అందిస్తున్నారా..? ఇలాంటివే పరిగణలోకి తీసుకుంటారు అంట. ఇక ఇప్పుడు గాయత్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Kollywood: ధనుష్ చెల్లెలిగా స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Pawan Kalyan: మీరు మా పెద్దన్న.. స్టార్ హీరోపై పవన్ కళ్యాణ్ ట్వీట్!

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ

Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

Big Stories

×