Peddi Shooting Update: రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత చేస్తున్న తొలి చిత్రం పెద్ది (Peddi). ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన(Bucchibabu Sana)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా ఎంపికైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుంచి ఏదో ఒక అప్డేట్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ షాట్ విడుదల చేయగా ఇందులో రామ్ చరణ్ లుక్ అలాగే క్రికెట్ బ్యాట్ తో కొట్టే షాట్ హైలెట్ గా నిలిచాయి.
పెద్ది షూటింగ్ అప్డేట్..
ఇలా ఒక అప్డేట్ తర్వాత మరొక అప్డేట్ వదులుతూ అభిమానులలో అంచనాలు పెంచుతున్న చిత్ర బృందం.. ఇప్పుడు సినిమా సంబంధించి తాజాగా విడుదల చేసిన షూటింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఈరోజు హైదరాబాదులో చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని…త్వరలో ఢిల్లీకి చిత్ర బృందం పయనం అవుతున్నట్లు సమాచారం. అక్కడ పెద్ది సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఈ కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారట. ఇకపోతే హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి కపూర్ కూడా జూలై 12వ తేదీ నుంచి సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారు.
పెద్ది సినిమా విశేషాలు..
పెద్ది సినిమా విశేషాల విషయానికి వస్తే.. తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Siva Raj Kumar), ప్రముఖ హీరో జగపతిబాబు(Jagapati babu) ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ (AR Rahman)ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. రత్నవేలు ఐఎస్పి ఛాయాగ్రహకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
రామ్ చరణ్ సినిమాలు..
రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ కి అవకాశం కల్పించారు రామ్ చరణ్ మరి ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ, డైరెక్టర్ సుకుమార్ లను లైన్ లో పెట్టినట్లు సమాచారం.
also read:Kalki 2 Update: కల్కి2పై అశ్వినీ దత్ బిగ్ అప్డేట్.. షూటింగ్ స్టార్ట్స్.. రిలీజ్ డేట్ లాక్!