Tribanadhari Barbarik:ఉదయభాను(Udayabhanu ) యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇండస్ట్రీలో తనకు అవకాశాలు ఇవ్వలేదని.. తనను తొక్కేశారు అంటూ పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరు పిల్లలు పుట్టాక ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. చాలాకాలం తర్వాత ‘త్రిభాణధారి బార్బరిక్ ‘ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో స్పెషల్ సాంగ్లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆ రెండు రోజులు టికెట్స్ ఫ్రీ..
ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే గ్రాండ్ పేరెంట్స్ నేపథ్యంలో వచ్చిన కారణంగా ఈ చిత్ర బృందం అభిమానులకు, ప్రేక్షకులకు శుభవార్త తెలిపింది. ముఖ్యంగా ఆ రెండు రోజులు ఉచితంగా టికెట్స్ ఇవ్వబోతున్నామని చెప్పి ఖుషీ చేసింది. ఈ మేరకు మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “మా సినిమాకి మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్, మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతున్నారు. అందుకే వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆఫర్ ఇస్తున్నాము. సెప్టెంబర్ మొదటి వారంలో అంటే సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా ఆగస్టు 30, ఆగస్టు 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు కుటుంబంతో కలిసి వచ్చే గ్రాండ్ పేరెంట్స్ కి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం ” అంటూ చిత్ర బృందం తెలిపింది. మొత్తానికి అయితే గ్రాండ్ పేరెంట్స్ కి ఈ రెండు రోజుల్లో ఉచితంగా టికెట్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అందరూ చూడదగిన సినిమా అని ,ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అటు చిత్ర బృందం కూడా స్పష్టం చేసింది.
నటీనటులు..
సత్యరాజ్ , వశిష్ట ఎన్ సింహ , సత్యం రాజేష్, ఉదయభాను, సాంచి రాయ్ తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మారుతీ టీం ప్రొడక్ట్ సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించారు.
త్రిబాణధారి బార్బరిక్ సినిమా స్టోరీ..
సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్యరాజ్) తన మనవరాలు నిధి (మేఘన) మిస్సింగ్ కేసు గురించి పోలీసులను ఆశ్రయిస్తారు. అదే సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న రామ్ (వశిష్ట ఎన్ సింహ) కి రూ. 30 లక్షలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అతనికి సత్య అనే అమ్మాయి పరిచయమవుతుంది. మరోవైపు జూదానికి బానిసైన లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) అల్లుడు దేవ్ దాసన్న (మొట్ట రాజేంద్రన్) రూ. 15 లక్షల అప్పు చేసి దాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడతాడు. అటు రామ్ , దేవ్ మంచి స్నేహితులు.. ఇద్దరికీ తమకి అవసరమైన డబ్బును ఎలా సంపాదించుకుంటారు? దానికి ఏం చేస్తారు? నిధికి ఏమైంది? తన మనవరాలు కోసం తాత శ్యామ్ ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ. మొత్తానికి అయితే మైథాలజికల్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు.
ALSO READ:Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ… సౌబిన్ షాహిర్ లవర్ హీరోయిన్!