Mana Shankara Varaprasad Garu : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే. ఈ రెండు సినిమాల్లో కనిపించాడు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత దాదాపు తెలుగు సినిమాలు చేయడం మానేశాడు. ఒక 10 ఏళ్ల పాటు ముంబై కు మాత్రమే పరిమితం అయిపోయాడు. మొత్తానికి స్వరూప్ ఆర్ఎస్ జే దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది.
ఈ సినిమా తరువాత అనుదీప్ కేవీ దర్శకత్వంలో జాతి రత్నాలు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే మహేష్ బాబు దర్శకత్వంలో మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. హీరోగా చేసిన మూడు సినిమాల్లో కూడా నవీన్ పోలిశెట్టికి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
మెగాస్టార్ కమింగ్ – రిస్క్ లో పోలిశెట్టి
దాదాపు కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది అని అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ జరగడం కూడా ఒక మైనస్. అయితే ఈ సినిమా జనవరి 14న విడుదల కాబతునట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ అదే డేట్ కు శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అని చిరంజీవి సినిమా విడుదల కానుంది. చిరంజీవి సినిమా వస్తుంది అంటే చాలామంది ప్రేక్షకులు అటువైపే మొగ్గు చూపుతారు. ఈ తరుణంలో నవీన్ సినిమా కొద్దిపాటి రిస్క్ లో పడినట్లే.
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్
ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. నవీన్ కూడా ఆషామాషీ సినిమాలు చేయడు. నవీన్ పోలిశెట్టి ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరించినట్లే ఉంటుంది. నవీన్ పోలిశెట్టి కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే అనగనగా ఒక రాజు సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు కూడా నవీన్ కి కలిసి వస్తాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. థియేటర్ సపోర్ట్ కూడా ఈ సినిమాకు బానే లభిస్తుంది. ఏదేమైనా చాలా సందర్భాల్లో చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి. దీని విషయంలో కూడా అలా జరిగిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
Also Read: Mouli Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు