IOCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ / డిప్లొమా / ITI / ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న 537 అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 537
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వివిధ రీజియన్లలో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఈస్టర్న్ రీజియన్ పైప్ లైన్, వెస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్, నార్తర్న్ రీజియన్ పైప్ లైన్స్, సదరన్ రీజియన్ పైప్ లైన్స్, సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్ లైన్స్ రీజియన్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు..
ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్: 156 పోస్టులు
వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్: 152 పోస్టులు
నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్: 97 పోస్టులు
సదరన్ రీజియన్ పైప్‌లైన్స్: 47 పోస్టులు
సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్: 85 పోస్టులు
విద్యార్హత: టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ITI లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.మ
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 29
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 18
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హత్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: https://iocl.com/apprenticeships
అప్లికేషన్ లింక్: https://plapps.indianoilpipelines.in/
ALSO READ: AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 537
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 18
ALSO READ: Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లక్షకు పైగా జీతం, ఇదే మంచి ఛాన్స్..!