BigTV English

Zainab Ravdjee: మావయ్యను డాడి చేసేసింది… అక్కినేని కొత్త కోడలపై అప్పుడే ట్రోల్స్

Zainab Ravdjee: మావయ్యను డాడి చేసేసింది… అక్కినేని కొత్త కోడలపై అప్పుడే ట్రోల్స్

Zainab Ravdjee: తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు లెగిసినీ కొనసాగిస్తూ నాగార్జున(Nagarjuna) ఆయన కుమారులు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. అక్కినేని నాగార్జున ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు హీరోగా 99 సినిమాలలో నటించిన నాగార్జున త్వరలోనే తన 100 వ సినిమాని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఆగస్టు 29వ తేదీ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన 100 వ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు భావించారు.


నాగార్జునకు విష్ చేసిన కొత్త కోడలు..

ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, తన కుటుంబ సభ్యులు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తన చిన్న కోడలు జైనాబ్(Zainab) తన మామయ్య నాగార్జునతో కలిసి ఉన్న ఫోటోని ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున గారు మీరు మాకు ప్రతిరోజు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీలాంటి వ్యక్తి తండ్రిగా ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను అంటూ జైనాబ్ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


తండ్రి కాదు.. మామయ్య

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జైనాబ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నాగార్జున మీకు తండ్రి కాదని, మామయ్య అవుతారు. చక్కగా మావయ్య అని పిలవచ్చు కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. తండ్రి లాంటి వారు అని చెబితే తప్పులేదు కానీ, ఏకంగా తండ్రి అంటూ మాట్లాడటం ఏంటని విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ పోస్టుపై మరికొంతమంది జైనాబ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.. ఉత్తరాది ప్రజలు మావయ్యను కూడా నాన్న అంటూ పిలుస్తారు అలా పిలవడంలో తప్పేమీ లేదు అటు మరికొందరు ఈమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త కోడలు వార్తలలో నిలిచారని చెప్పాలి.

ఇక అఖిల్ జైనాబ్ వివాహం జూన్ 6 వ తేదీ హైదరాబాదులో నాగార్జున నివాసంలో చాలా సింపుల్ గా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక అఖిల్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు ఐదు సినిమాలలో నటించిన ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈయనకు అదృష్టం కలిసి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Jyothika: అంతా స్వార్థపరులే.. సౌత్ ఇండస్ట్రీ పై నటి జ్యోతిక షాకింగ్ కామెంట్స్

Related News

Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Tvk Party – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో విజయ్ టీవీకే పార్టీ జెండా?

NTR-Neel Movie: ప్రశాంత్‌ నీల్‌ భారీ స్కేచ్‌.. కేజీయఫ్‌, సలార్‌ల మించి ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ, బడ్జెట్‌ పరిమితులే లేవు..

Big Stories

×