అమెరికా అధ్యక్షుడు డొనాాల్డ్ ట్రంప్ చనిపోయాడంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఆయన ఆరోగ్యం గురించి పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ, సోషల్ మీడియాలో ఆయన చనిపోయారంటూ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రతీకార సుంకాలతో ట్రంప్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై కూడా పలు రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన చనిపోయారంటూ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి రావడం మరింత సంచలనంగా మారింది. కొంతమంది ట్రంప్ శవపేటికలో పడుకొని ఉన్నట్టుగా క్యారికేచర్ లు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. మొత్తమ్మీద ట్రంప్ మరణించకుండానే ఆయన మరణ వార్తల్ని వైరల్ చేస్తున్నారు, అన్నిటికంటే మించి ఆ వార్తల్ని కామెడీగా మార్చేస్తున్నారు.
if trump is dead i will give 100 dollars to anyone who like this tweet pic.twitter.com/aZh0NaLI6q
— makri (@makrixyz) August 30, 2025
* Trump is dead * trending
Pakistani right now: pic.twitter.com/5aX6qdyzkX
— Binod (@wittybinod) August 30, 2025
అసలు ట్రంప్ కి ఏమైంది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు 79 ఏళ్లు. ఆ వయసులో హుషారుగా ఉండటం కూడా కష్టమే. కానీ ట్రంప్ అత్యంత క్లిష్టమైన బాధ్యతలు మోస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ గా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రపంచ యాత్రలు చేస్తున్నారు. అయితే వయసు రీత్యా ట్రంప్ కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఆయనకు సిరల వాపు వ్యాధి ఉంది. ఇది కూడా వయసుతోపాటు వచ్చేదే. సిరలలో రక్త ప్రవాహం సరిగా జరగకపోవడం వల్ల అవి వాచిపోయినట్టు కనపడతాయి. దీంతో చేతులు, కాళ్లలో అసాధారణ వాపు స్పష్టంగా కనపడుతుంది. చీలమండలు కూడా వాచిపోయి నడవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ట్రంప్ బహిరంగ వేదికలపైకి రావడంతో ఆయన అనారోగ్యం గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.
వైట్ హౌస్ వివరణ ఇచ్చినా..
ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని, చిన్న చిన్న ఇబ్బందులు సహజం అని, ఆయన గుండె పనితీరు బాగుందని.. ఇటీవల కాలంలో వైట్ హౌస్ వర్గాలు పలుమార్లు వివరణ ఇచ్చుకున్నాయి. కానీ ఆయన బయటకు వచ్చే సమయంలో మేకప్ తో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్య లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందుకే ఆయన ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన సమయంలో కూడా ఆయన తూలిపోతున్నట్టుగా కనపడ్డారు.
బాంబ్ పేల్చిన జేడీవాన్స్..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజా ఇంటర్యూ ట్రంప్ అనారోగ్య వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఊహించని విషాదం ఏదయినా జరిగితే తాను నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని వాన్స్ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అధ్యక్షుడికి జరగరానిది ఏదైనా జరిగితే ఆ పదవి చేపట్టేందుకు తాను రెడీ అని ఉపాధ్యక్షుడు చెప్పినట్టేనా అని అర్థాలు తీస్తున్నారు చాలామంది. జేడీ వాన్స్ మాటల మర్మం కూడా అదేనంటున్నారు. స్వయానా ఉపాధ్యక్షుడే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ తర్వాత ట్రంప్ ఆరోగ్యం గురించి మరింతగా ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై వాన్స్ మరోసారి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆయన అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారని, రాత్రి పొద్దుపోయే వరకు పనిచేస్తుంటారని, తెల్లవారిన తర్వాత కూడా ఉత్సాహంగా విధులకు హాజరవుతున్నారని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ బార్బబెల్లా కూడా ఇటీవల ఒక అధికారిక నోట్ విడుదల చేయడం విశేషం. ఆస్పిరిన్ మందులు వాడటం వల్ల వచ్చే చికాకు తప్ప ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పుకొచ్చారు డాక్టర్ బార్బబెల్లా. అయినా కూడా ట్రంప్ పై పుకార్లు ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఆయన చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలు సంచలనంగా మారాయి.