Nani: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని, అష్టా చమ్మా సినిమాతో నటుడుగా తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు నాని. ఇక ప్రస్తుతం నాని రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాని ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని అందరూ ఫిక్స్ అయి థియేటర్ కు రావడం మొదలు పెడుతున్నారు.
జెర్సీ సినిమా తర్వాత నాని ఎంచుకున్న అన్ని సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటున్నాయి. అలానే ఒకే ధోరణి లో అన్ని సినిమాలు చేయకుండా, సినిమా సినిమాకి ఒక మార్పును తీసుకొస్తున్నాడు. అలానే కొత్త దర్శకులను కూడా పరిచయం చేస్తున్నాడు. సినిమా పైన విపరీతమైన ప్రేమ ఉంది నానికి.
ఒక సినిమా పోవాలి అని కోరుకోను
ఇక నాని రీసెంట్ గా ఒక రియాలిటీ షో కి హాజరయ్యారు. జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆ షో లో ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. నాని మాట్లాడుతూ.. “చాలామంది మా వాడి సినిమా ఆడాలి ఇంకొకడి సినిమా ఆడకూడదు అని అంటుంటారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పటి నుంచి ఈ మాటలు వింటూనే ఉన్నాను. కానీ నేను మాత్రం నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకోక సినిమా రిలీజ్ ఉంటే అది కూడా బాగా ఆడాలి అని కోరుకుంటాను. అంటూ తెలిపాడు. అలానే పలు సందర్భాలలో నాని మాట్లాడుతూ తన సినిమాతో పాటు విడుదలవుతున్న సినిమాలుకు కూడా ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
సినిమాను ప్రశంసిస్తాడు
చాలామంది కొన్ని సినిమాలు చూసి సైలెంట్ గా ఉండిపోతారు. ఆ సినిమాలు ఎంత బాగున్నా కూడా వాటిపైన వాళ్లకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పరు. చాలా తక్కువ మంది మాత్రం ఒక సినిమా నచ్చితే దాన్ని పదిమందికి చెప్పే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తను చూసిన ఏ సినిమా నచ్చినా కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెడతారు. అలానే నాని కూడా తనకు ఒక సినిమా నచ్చినట్లైతే తన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతారు.
అలా బలగం సినిమా గురించి నాని చాలాసార్లు మాట్లాడారు. అలానే తమిళ్లో తెరకెక్కి తెలుగులో విడుదలైన సత్యం సుందరం (Satyam Sundaram) సినిమా గురించి కూడా నాని చాలా సందర్భాల్లో గొప్పగా మాట్లాడారు. సినిమాని ప్రశంసిస్తూ, సినిమా బాగుండాలి అనే కోరుకునే అతి తక్కువ మంది హీరోలలో నాని ఒకడు.
Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేది అప్పుడే, అత్త సుహాసిని క్లారిటీ