BigTV English

Mouli Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు

Mouli Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు

Mouli Talks: రీసెంట్ డేస్ లో సోషల్ మీడియా ఒక రేంజ్ లో పాపులర్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా చాలామందికు మంచి అవకాశాలను తీసుకొస్తుంది. కానీ అది సోషల్ మీడియాను వాడుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. చాలామంది రీల్స్, ఫన్నీ యూట్యూబ్ కంటెంట్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిలో పడటం. కొంతమంది దర్శకులు ఏరి కోరి వాళ్లను తీసుకొని సినిమాలో పెట్టుకోవడం వలన మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు.


రితీష్ రాణా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ బర్త్డే సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు మౌళి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత ఈటీవీ విన్ లో వచ్చిన 90 మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ బాగా పాపులర్ అయింది. ఆ సిరీస్ తో మౌలికి మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం మౌళి లిటిల్ హార్ట్స్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కొద్దిరోజుల క్రితం విడుదలై మంచి ఆదరణను సాధించుకుంది.

బుర్ర లేని డైరెక్టర్లు ఉన్నారు 


ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో మౌళి కొంతమంది దర్శకులు పైన సంచలన విషయాలను తెలియజేశాడు. వైజాగ్ లో ఉన్నప్పుడు చాలా తెలివైన వాళ్లే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు. వాళ్లు మాత్రమే సినిమాలు తీయగలరు అని అనుకునేవాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఊర్లలో కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు కదా వాళ్ళు చాలా బెటర్ అనిపించింది.

ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమంది ఆఫీస్కి రమ్మని పిలుస్తారు. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఒక సీన్ చెప్తారు. దీని తర్వాత ఫుల్ కామెడీ బ్రో అంటారు. కామెడీ ఏది అని అడిగితే, కామెడీ రాయలేదు రాస్తాం అంటారు. అలానే చాలామంది ఆడిషన్స్ తీసుకున్నారు. ఏం చేయాలని ఒకరికి క్లారిటీ ఉండదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు. అని మౌళి ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

మంచి ఎక్స్పెక్టేషన్స్ 

మౌళి నటిస్తున్న లిటిల్ హార్ట్స్ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది యూత్ కి ఈ టీజర్ బాగా కనెక్ట్ అయింది. 90 కిడ్స్ ఇటువంటి అనుభవాలను తమ జీవితంలో చూశారు వాటన్నిటిని ఈ సినిమాలో పొందుపరిచాడు దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాతగా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నాడు. ఇది ఈటీవీ విన్లో విడుదల చేయడానికి మొదటి సిద్ధమయ్యారు. కానీ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు దీనిని చూసి థియేటర్లో విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.

Also Read : Nani: ఒక సినిమా పోవాలి అని కోరుకునే క్యారెక్టర్ కాదు నాది

Related News

Allu Kanakaratnamma : మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అల్లు కనక రత్నమ్మ

Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Tvk Party – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో విజయ్ టీవీకే పార్టీ జెండా?

Big Stories

×