E-Paper
Advertisement

Asia Cup 2025 : దుబాయ్ లో ఎండలు.. ఆసియా కప్ 2025 టైమింగ్స్ చేంజ్… కొత్త షెడ్యూల్ ఇదే!

Asia Cup 2025 : దుబాయ్ లో ఎండలు.. ఆసియా కప్ 2025 టైమింగ్స్ చేంజ్… కొత్త షెడ్యూల్ ఇదే!
Advertisement

Asia Cup 2025 :  ఆసియా కప్ 2025 (Asia Cup 2025)  సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం అవ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ నుంచి రొజుకొక అప్డేట్ వచ్చేస్తుంది. అయితే ఇందులో మొత్తం ఆసియా ఖండంలోని 8 జట్లు తలపడుతాయి. వాస్తవానికి టోర్నమెంట్ ప్రారంభానికి ముందే బిగ్ అప్ డేట్ వచ్చేసింది. అది ఏంటంటే..? ఆసియా కప్ మ్యాచ్ ల ప్రారంభ సమయాన్ని ఐసీసీ మార్పు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ దుబాయ్ లో జరుగుతుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లు యూఏఈ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పగటి వేళ ఎక్కువగా వేడి ఉండటం వల్ల మ్యాచ్ ను అరగంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. అంటే సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు.

Also Read :  BCCI – Dhoni : గంభీర్ పోస్ట్ గల్లంతు.. ధోనీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన BCCI?

Advertisement

ఆసియా కప్ టైమింగ్స్ లో మార్పులు.. 

ఈ టోర్నమెంట్ లో 19 మ్యాచ్ లకు గాను 18 మ్యాచ్ లకు సమయం మార్చినట్టు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం.. భారత్  లో ప్రతీ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. దుబాయ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో ఐసీసీ (ICC) ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆసియా కప్ 2025 (Asia cup 2025)  టీ-20 ఫార్మాట్ లో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పుడు షెడ్యూల్ లో మార్పు చేశారు. దీంతో భారత్ లో రాత్రి 8 గంటల నుంచి ప్రత్యక్ష్యంగా వీక్షించవచ్చు. యూఏఈ (UAE) లో సెప్టెంబర్ నెలలో దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వేడి నుంచి ఆటగాళ్లకు కాస్త ఉపశమనం లభించడానికి మ్యాచ్ సమయాన్ని అరగంట పెంచారు. క్రికెట్ బోర్డు ఈ సమయాన్ని మార్చాలని బ్రాడ్ కాస్టర్ ని కోరింది. ఇక ఆ తరువాత భరించలేని వేడిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Advertisement

ఆ ఒక్క మ్యాచ్ మినహా.. 

ఆసియా కప్ లో ఫైనల్ మ్యాచ్ తో కలిపి మొత్తం 19 మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో 18 మ్యాచ్ ల సమయాలను అరగంట ఆలస్యంగా జరిగేవిధంగా టైమింగ్స్ మార్పులు చేశారు. అయితే వీటిలో సెప్టెంబర్ 15న జరిగే యూఏఈ-ఒమన్ మధ్య జరిగే పగటి మ్యాచ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అవుతుంది.  మిగతా మ్యాచ్ లు అన్ని కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. ఆసియా కప్ లో టీమిండియా (Team India)  సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఆ తరువాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో తలపడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్ తో ఆడనుంది. మొత్తం మూడు మ్యాచ్ లను లీగ్ దశలో ఆడనుంది. మరోవైపు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగనుంది. గ్రూపు-ఏలో టాప్ 2, గ్రూపు-బీలో టాప్ 2 జట్లు సూపర్ 4 కి ఎంపికవుతాయి. వీటిలో రెండు జట్లు ఫైనల్ కి చేరుకుంటాయి. ఫైనల్ లో విజేత ఎవ్వరనేది సెప్టెంబర్ 28న రాత్రి తేలనుంది.

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×