Lokesh Kanagaraj:సినీ రంగంలో 24 క్రాఫ్ట్స్ లో ఏదో ఒక విభాగంలో చాలామంది సెటిల్ అవుదామని అనుకుంటారు. కానీ మరి కొంతమంది అన్ని విభాగాలలో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పటికే హీరోలు ఎంతోమంది హీరోగానే కాకుండా విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాణ రంగంలో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది హీరోలు దర్శకులుగా కూడా మారుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు కూడా హీరోగా తాము కూడా ఫిట్ అంటూ నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు డైరెక్టర్లుగా పనిచేసి.. ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఒకవైపు దర్శకుడిగా పనిచేసి.. ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
హీరోగా మారనున్న లోకేష్ కనగరాజు..
ఇప్పుడు ఈయన దారిలోకి ప్రముఖ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) కూడా వచ్చి చేరనున్నారు. రీసెంట్గా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna ) విలన్గా నటించిన ‘కూలీ’ సినిమాకి దర్శకత్వం వహించి, మంచి విజయం అందుకున్న లోకేష్ ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తనున్నారు.. అందులో భాగంగానే త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. లోకేష్ కనగరాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. కూలీ సినిమాలో సౌబిన్ షాహిర్(Soubin Sahir) భార్యగా నటించిన రచితారామ్ (Rachita Ram)హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ విషయం త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
డైరెక్టర్గా సత్తా చాటిన లోకేష్..
ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. 2017లో తమిళంలో విడుదలైన ‘మా నగరం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమయ్యారు. 2019లో కైతీ , 2021 లో వచ్చిన మాస్టర్ సినిమాలతో సత్తా చాటిన ఈయన.. 2022లో విక్రమ్ సినిమాతో దర్శకుడిగా మరింత పేరు సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా అవతారం ఎత్తకముందు ఎంబీఏ పూర్తి చేసి నాలుగున్నర సంవత్సరాల పాటు బ్యాంకులో పని చేసిన ఈయన.. అటు సినిమాలపై ఆసక్తితో 2014లో ‘కస్టమర్ డిలైట్’ అనే షార్ట్ ఫిలిం కూడా తీశారు. ఈ షార్ట్ ఫిలింకి ఒక కార్పొరేట్ ఫిలిం కాంపిటీషన్లో మొదటి ప్రైజ్ వచ్చింది. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వ్యవహరించగా.. అలా ఆయనతో ఏర్పడిన పరిచయం 2016లో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఆవియల్ అనే ఇండిపెండెంట్ ఆంథాలజీ సినిమాలో ఒక భాగమైన కాలం అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించి.. కార్తీక్ వల్ల ఇండస్ట్రీకి పరిచయమయ్యారు లోకేష్. రీసెంట్గా కూలీ సినిమా చేసిన ఈయన.. అటు కైతి 2 సినిమా కూడా చేస్తున్నారు. మరొకవైపు హీరోగా అవతారం ఎత్తనున్నారు.
ALSO READ:Police Police OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన థ్రిల్లర్ కామెడీ సీరీస్.. ఎప్పుడు, ఎక్కడంటే?