BCCI – Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్టు క్రిక్ బ్లాగర్ పేర్కొంది. 2021 టీ-20 వరల్డ్ కప్ కు ధోనీ టీమిండియా మెంటర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి అలా పార్ట్ టైమ్ కాకుండా పుల్ టైమ్ మెంటర్ గా ఉండాలని ధోనీని కోరినట్టు బీసీసీఐ ప్రతినిధి తెలిపారని వివరించింది. సీనియర్, జూనియర్ జట్లు సహ మహిళల టీమ్స్ కి ధోనీ ని మెంటర్ గా వ్యవహరించాలని కోరినట్టు తెలిపింది. ఇప్పటికే M.S. ధోనీ భారత్ కి రెండు ప్రపంచకప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎడిషన్ లో బరిలోకి దిగుతాడా..? లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
Also Read : Watch Video : ఆఫ్ఘనిస్తాన్ లో కలకలం…. ఒకే దగ్గర లక్షమంది.. క్రికెట్ అంటే ప్రాణమిచ్చేలాగా ఉన్నారే
టీమిండియా మెంటార్ గా ధోనీ..?
2021 టీ-20 వరల్డ్ కప్ సమయంలో ధోనీ ని బీసీసీఐ మెంటార్ గా నియమించుకుంది. అప్పుడు కేవలం ఆ టోర్నీ వరకే సేవలు అందించేవిధంగా ఒప్పందం చేసుకుంది. ఇక ఆ తరువాత ధోనీకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఈసారి మాత్రం అలా షార్ట్ టర్మ్ కాకుండా..భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అతని చురుకైన వ్యూహాలను సుదీర్ఘంగా వాడుకోవాలని భావిస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే మరోసారి మెంటార్ గా ధోనీ ని నియమించుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మరీ మాజీ కెప్టెన్ అందుకు అంగీకరిస్తాడా..? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఒకవేళ ధోనీ అందుకు అంగీకరించినట్టయితే గౌతమ్ గంభీర్ పోస్ట్ గల్లంతు కావడం గ్యారెంటీ అని మరికొందరూ పేర్కొంటున్నారు.
గంభీర్ పదవీ గల్లంతు..?
ఇంకోవైపు ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అయితే ధోనీ మెంటార్ గా ఉంటే.. గంభీర్ సానుకూలంగా ఉండకపోవచ్చని పలువురు క్రికెట్ విశ్లేకులు పేర్కొంటున్నారు. ధోనీ కెప్టెన్సీలో గెలిచిన వన్డే, టీ-20 వరల్డ్ కప్ జట్లలో గంభీర్ కూడా సభ్యుడే. అయినప్పటికీ అప్పట్లో క్రెడిట్ అంతా కెప్టెన్ ధోనీ కే ఇవ్వడం సరికాదని చాలా సందర్భాల్లో గంభీర్ వెల్లడించాడు. టీమిండియా కలిసి కట్టుగా ఆడితేనే విజయాలు వరిస్తాయని చెప్పాడు గంభీర్. ధోనీ వంటి దిగ్గజ క్రికెటర్ ను తనకంటే కాస్త పై పదవీలో ఉంచేందుకు గంభీర్ ఇప్పుడు ఇష్టపడతాడా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పవచ్చు. ఇటీవల ధోనీ, గంభీర్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్ననారు. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియా లో కూడా వైరల్ గా మారాయి. అయితే ఏది ఏమైనప్పటికీ బీసీసీఐ ఆఫర్ కి కనుక ధోనీ ఒప్పుకుంటే.. గంభీర్ పదవీ గల్లంతు కావడం గ్యారెంటీ అని కొందరూ పేర్కొనడం గమనార్హం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.