UPI Money Transfer: డిజిటల్ యుగంలో యూపీఐ సేవలు మన జీవితాన్ని సులువుగా మార్చేశాయి. దీనివల్ల మన లావాదేవీలు ఎంత సులభంగా జరిగిపోతున్నాయో అందరికీ తెలుసు. ఒకప్పుడు డబ్బు కోసం బ్యాంక్‌లో గంటల తరబడి క్యూలో నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అత్యవసరమైతే తప్ప మనం బ్యాంక్ ముఖం చూడడం చాలా అరుదుగానే జరుగుతోంది. ఫోన్‌లోని యాప్ ద్వారా ఎవరికి కావాలంటే వారికి తక్షణమే డబ్బు పంపే సౌకర్యం అందుబాటులోకి రావడంతో మన జీవితం నిజంగా చాలా సులభమైంది.
అయితే దీనివల్ల మంచే కాదు, కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, చాలా సార్లు మనం తొందరపాటు వల్ల లేదా జాగ్రత్త లేకపోవడం వల్ల రాంగ్ నెంబర్ టైప్ చేయడం వల్లా లేదా వేరే ఖాతాకి డబ్బులు వెళ్లిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకరికి పంపాల్సిన డబ్బులు పొరపాటున మరొకరి ఖాతాలో వెళ్ళిపోవడంతో ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు చాలామంది ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి సందర్భాల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెంటనే కొన్ని చర్యలు తీసుకుంటే మన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: RBI to Banks: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ఏటీఎంలో ఆ నోట్లు తప్పనిసరి
వెంటనే ఇలా చేయండి
ముందుగా మనం పంపిన ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేయాలి. ఏ నెంబర్‌కి లేదా ఏ యూపీఐ ఐడీకి డబ్బు వెళ్లిందో క్లియర్‌గా చూసుకోవాలి. ఆ తర్వాత వెంటనే యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌కి సంప్రదించి సమస్యను తెలియజేయాలి. మనం పంపిన యూపీఐ ఐడీ, ట్రాన్సాక్షన్ వివరాలను అందిస్తే, వారు మన బ్యాంక్‌తో టచ్‌లోకి వెళ్లి డబ్బు రీఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒకవేళ యాప్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, మనం నేరుగా మన బ్యాంక్‌ను సంప్రదించాలి. బ్రాంచ్‌కు వెళ్లినా, కస్టమర్ సర్వీస్ నంబర్‌కి కాల్ చేసినా ఫరవాలేదు. అన్ని వివరాలు అందిస్తే బ్యాంక్ మనం డబ్బు పంపిన వ్యక్తిని సంప్రదించి తిరిగి ఇవ్వమని అడుగుతుంది.
మరో మార్గం..
ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే మనకు మరో మార్గం ఉంది. అదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). ఇది యూపీఐ సేవలను పర్యవేక్షించే సంస్థ. NPCI వెబ్‌సైట్‌లో మనం ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ నుండి కూడా చాలా సందర్భాల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం పంపిన డబ్బు పెద్ద మొత్తం అయితే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించడం చాలా మంచిది. వారు మన నుండి ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్, యూపీఐ ఐడీ, డబ్బు పంపిన సమయం, ఇతర వివరాలు తీసుకుని వెంటనే విచారణ ప్రారంభిస్తారు. అవసరమైన చర్యలు తీసుకుని మన డబ్బు తిరిగి వచ్చేలాగా చూస్తారు.
ఖాతా నంబర్ పరిశీలించండి..
అయితే ఇలాంటి సమస్యలే రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. డబ్బు పంపే ముందు ఎప్పుడూ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను రెండుసార్లు పరిశీలించాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నప్పుడు కూడా పేరు కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. తొందరపాటుకు లోనవకుండా జాగ్రత్తగా ఉంటే తప్పు జరగదు. పొరపాటు జరిగితే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆలస్యం చేసిన ప్రతిసారీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం తగ్గిపోతుంది.