BigTV English

September 2025 Eclipses: సెప్టెంబర్‌లో రెండు గ్రహణాలు.. భారతదేశంలో ఎక్కడ కనపడతాయి?

September 2025 Eclipses: సెప్టెంబర్‌లో రెండు గ్రహణాలు.. భారతదేశంలో ఎక్కడ కనపడతాయి?

September 2025 Eclipses: సెప్టెంబర్ నెలలో శాస్త్రవేత్తలకే కాకుండా దేశ ప్రజలకు కూడా ఒక ఆశ్చర్యకర సంఘటన కనిపించబోతోంది. ఎందుకంటే ఈ ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. సాధారణంగా చంద్రగ్రహణం ఒక నెలలో, సూర్యగ్రహణం మరొక నెలలో వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడం విశేషంగా చెప్పుకోవాలి. శాస్త్రవేత్తలు కూడా ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన అని చెబుతున్నారు. జ్యోతిష్య పండితులు అయితే దీనికి సంబంధించిన సూతకాలం అంటే జ్యోతిష్యంలో, గ్రహణాలు, సూర్యోదయాలు, చంద్రోదయాలు, నక్షత్రాల స్థానం, గ్రహాల కదలికలను గణనాత్మకంగా లెక్కించడం అంటారు. దాని ప్రభావం గురించి వివరణ ఇస్తున్నారు.


చంద్రగ్రహణం అంటే ఏమిటి?

చంద్రగ్రహణం గురించి మాట్లాడితే, భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున, అంటే సెప్టెంబర్ 7 రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రుడిపై భూమి నీడ పడడం ప్రారంభమవుతుంది. తరువాత క్రమంగా చంద్రుడు మసకబారుతూ చివరకు పూర్తిగా కనపడకపోయే స్థితికి చేరుకుంటాడు. రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుడు సంపూర్ణంగా ఆవరించబడతాడు. ఈ స్థితినే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. ఆ స్థితి కొంతసేపు కొనసాగి, చివరకు సెప్టెంబర్ 8 తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రుడు మెల్లగా బయటపడతాడు. ఈ విధంగా మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం కొనసాగుతుంది.


ఈ చంద్రగ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల మన దేశంలో సూతక కాలం తప్పనిసరిగా వర్తిస్తుంది. చంద్రగ్రహణం సంభవించే రోజున ఆహారం వండకూడదు, పాలు లేదా ద్రవ పదార్థాల్లో తులసి ఆకులు లేదా దర్భ వేసి మూసి పెట్టడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ సమయం మొత్తం పూజలు చేయకూడదని, అయితే మంత్రాలను జపించడం, స్తోత్రాలు చదవడం, దానధర్మాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. భక్తుల దృష్టిలో గ్రహణం ఒక పవిత్రమైన సమయంగా భావించబడుతుంది. ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం రోజున జపం, తపస్సు, సాంప్రదాయ కర్మలు చేస్తే పుణ్యం అధికమతుందని నమ్మకం ఉంది.

Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం

రెండోది సూర్యగ్రహణం ఎప్పుడు కనపడుతుంది?

ఇక సెప్టెంబర్ నెలలో రెండో గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. ఇది సెప్టెంబర్ 21 రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై, తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కొనసాగుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. కనుక మన దేశంలో ఈ గ్రహణానికి సంబంధించిన సూతకాలం వర్తించదు.

సూర్యగ్రహణం కనిపించదా?

అయినా జ్యోతిష్య పండితులు ఒక సూచన చేస్తున్నారు. సూర్యగ్రహణం మన దేశంలో కనబడకపోయినా, ఆ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా గంగాజలంతో కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. భక్తులు ఈ సమయంలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతి పొందవచ్చని కూడా అంటున్నారు.

శాస్త్రీయం ప్రకారం

శాస్త్రీయంగా చూస్తే గ్రహణాలు సహజమైన ఖగోళ సంఘటనలు మాత్రమే. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశిస్తే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అదే విధంగా చంద్రుడు భూమి, సూర్యుడు మధ్యలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది విశ్వంలో జరిగే సహజ పరిణామం తప్ప మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ సాంప్రదాయ పరంగా మనం అనుసరిస్తున్న ఆచారాలు మాత్రం వేరే కోణంలో ఉంటాయి. గ్రహణ సమయాల్లో పూజలు ఆపి, జపం, తపస్సు, ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వడం, స్నానదానం వంటి శ్రద్ధాచరణలు చేయడం మన సంప్రదాయంగా కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్‌లో రెండు గ్రహణాలు

సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. సెప్టెంబర్ 7 రాత్రి నుంచి 8 తెల్లవారుజామున వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనుక సూతకాలు వర్తిస్తాయి. ఆ తరువాత సెప్టెంబర్ 21 రాత్రి నుంచి 22 తెల్లవారుజామున వరకు పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది. కానీ ఇది మన దేశంలో కనిపించదు కనుక మనకు సూతకం ఉండదు. శాస్త్రవేత్తల దృష్టిలో ఇది ఒక సహజ సంఘటన. జ్యోతిష్య పండితుల దృష్టిలో ఇది ఆధ్యాత్మిక సాధనకు శుభసమయం. అందుకే ఈ రెండు గ్రహణాలకూ మన దేశంలో విశేష ప్రాధాన్యం ఏర్పడింది.

Related News

Vastu Dosh: ఇంట్లోని వాస్తు దోషాలను ఎలా గుర్తించాలి ?

Gift Items: పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవ్వరికీ.. బహుమతిగా ఇవ్వొద్దు !

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Big Stories

×