Manoj Bajpayee: ఒకప్పుడు సినిమాలు చూడాలి అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసే అవకాశం ఉండేది. ఇక థియేటర్లలో సినిమా పూర్తి అయిన తర్వాత టెలివిజన్లో ప్రసారమయ్యే వరకు ఆ సినిమాని చూసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో ఓటీటీ(OTT)లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలలోపే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా కొన్ని సినిమాలు నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ పెద్ద ఎత్తున ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee)ఓటీటీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
గొప్ప వరం…
ఈయన నటుడిగా ఎన్నో సినిమాలలో నటించిన ఈయనకు మాత్రం ది ఫ్యామిలీ మెన్(The Family Men) సిరీస్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిన సంగతి తెలిసినదే . ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే మూడో సీజన్ ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలోనే మనోజ్ బాజ్ పాయ్ ఓటీటీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓటీటీలు తనలాంటి నటులకు గొప్ప వరమని ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక సినిమా థియేటర్లో విడుదల అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ నెంబర్ లపై ఆధారపడుతుంది.
ఓటీటీ ద్వారా లబ్ధి పొందాను…
ఇక ఓటీటీలో మాత్రం మంచి కథ ప్రతిభావంతులైన నటులు ఉంటేనే ఆదరణ పొందుతాయని ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఫ్యామిలీ మెన్ సీరియస్ నుంచి గమనిస్తున్నానని తెలిపారు. ఓటీటీ వచ్చిన తర్వాత ఎంతోమంది నటులు కాస్త నష్టపోయిన మరి కొంతమంది బాగా లాభపడ్డారని, అలా లబ్ధి పొందిన వారిలో తాను ఒకడు అంటూ మనోజ్ బాయ్ పాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతవరకు లాభదాయకంగా ఉన్నప్పటికీ మరి కొంత మాత్రం సినిమాలకు పెద్ద ఎత్తున నష్టాలను కలుగజేస్తున్న సంగతి తెలిసిందే.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో..
థియేటర్లో ఒక సినిమా విడుదలైన నెల రోజులకే తిరిగి ఓటీటీలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు చాలా వరకు థియేటర్లకు వెళ్లడం మానుకున్నారని, నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి సినిమాలు వస్తున్న నేపథ్యంలోనే ఓటీటీ వైపే మక్కువ చూపడంతో సినిమాల కలెక్షన్ల పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది దర్శక నిర్మాతలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ది ఫ్యామిలీ మెన్ విషయానికి వస్తే డైరెక్టర్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ రెండు భాగాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక రెండవ సీజన్లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే మూడవ సీజన్ ప్రసారానికి సిద్ధం కానుంది. ఇలా మొదటి రెండు సీజన్లలో కూడా మనోజ్ బాజ్ పాయ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
Also Read: Zainab Ravdjee: మావయ్యను డాడి చేసేసింది… అక్కినేని కొత్త కోడలపై అప్పుడే ట్రోల్స్