Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్ధుల తరుఫున ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్యనేతలందరూ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచిన నేపధ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రావడంలేదని పార్టీల నేతలందరూ తలలు పట్టుకుంటున్నారట.
జూబ్లీహిల్స్‌లో అంతుపట్టని ఓటర్ల నాడి
తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటరు నాడి అంతుచిక్కడం లేదట. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల్లోని స్టార్ క్యాంపెయినర్లందరూ ఎన్నికల ప్రచారం విసృత్తంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డివిజన్‌ల వారీగా ప్రచారం చేసేలా షెడ్యూల్ చేసుకున్నారు. బీజేపీ అగ్రనేతలందరూ కార్పెట్ బాంబింగ్ పేరిట ప్రచారం చేస్తున్నారు.
ఓటర్ల మనసులో ఏముందో అంతుపట్టక జుట్లు పీక్కుంటున్న నేతలు
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలోను ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రావడంలేదని పార్టీల నేతలు చేవులు కొరుక్కుంటున్నారట. ప్రచారానికి ఏ పార్టీ అభ్యర్థి వెళ్లినా మా మద్దతు మీకేనంటూ హామీ ఇస్తున్నారట ఓటర్లు. భరోసా ఇచ్చిన వారు పోలింగ్ రోజున అదే మాటపై ఉంటారో.. మాట తప్పుతారో తెలియక పాయకులు పరేషాన్ అవుతున్నారట. ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఫోకస్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా బాధ్యతలు అప్పగించి తిప్పుతున్నారు.
డివిజన్, వార్డుల వారీగా ఓ ముఖ్యనాయకుడికి బాధ్యతలు
డివిజన్, వార్డుల వారీగా ఓ ముఖ్యనాయకుడికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. కాలనీలు, బస్తీలు, గల్లీలు, సామాజిక వర్గాల వారీగా తమకు ఎన్ని ఓట్లు నమ్మకంగా పడుతాయనే అంచనా వేసేందుకు ప్రధాన పార్టీల నేతలందరూ నియోజకవర్గమంతా తిరుగుతున్నారట. ప్రస్తుతం ఉన్న ట్రేండ్స్ అంచనా వేసేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదనే చర్చ నడుస్తుందట. రాలేక అభ్యర్థులు, పార్టీ ముఖ్యనాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రచారానికి ఎవరు వెళ్లినా ప్రజలు సానుకూల స్పందన
ప్రచారానికి ఎవరు వెళ్లినా వారికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తుండటంతో , వారి మద్దత ఎవరికనేది మూడు పార్టీలకు అంతుపట్టకుండా తయారైందంట. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులందరి ప్రచారంలోను ప్రజల నుంచి స్పందన వస్తున్న చూసి నేతలందరూ గందగరగోళానికి గురవుతున్నారట. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు ఓటర్లు మా ఓట్లు మీకేనని అని చెబుతుండడం…మాతోపాటు పక్కన వాళ్లకు చెబుతామని చేబుతుండడం నేతలు ఖుషి అవుతున్నారట.
Also Read: పాపం.. అత్త, మామల వేధింపులు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య..
సందిగ్ధంలో పార్టీ ముఖ్యనాయకులు, అనుచరులు
ఇలా ఏ పార్టీ అభ్యర్థి వెళ్లినా, అభ్యర్థి తరపు నాయకులు ప్రచారం చేసినా.. అదే ముచ్చట చెబుతుండడం ఆసక్తికరంగా మారిందట. దీంతో ప్రచారానికి వెళ్లిన నాయకులు తమ పార్టీ విజయం గ్యారంటీ అని నమ్ముతున్న పరిస్థితి నెలకొంటుందట. అయితే మాట ఇచ్చిన వారిలో ఎంతమంది నమ్మకంగా ఓట్లు వేస్తారోనని అభ్యర్థులతో పాటు.. పార్టీ ముఖ్యనాయకులు, వారి అనుచరులు సందిగ్దంలో పడుతున్నారట. పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎవరికి వేశామో ఎవరికీ తెలియదని.. ఎవరు గెలిస్తే వారికే మా ఓట్లు వేశామని చెబితే సరిపోతుందనే భావనలో ఓటర్లు ఉన్నారనే టాక్ నడుస్తుందట. ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ ట్రెండ్ ఎంటనేది చేప్పలేమనేది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రతిష్టాత్మకమైన బైపోల్ పోరులో ప్రజల ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది కౌంటింగ్ రోజైన నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సిందే.
Story By Apparao, Bigtv