Singer Death: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘లక్ష్మి’ సినిమా సింగర్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి సినీ సెలెబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలు ఏంటో? ఆయన ఎలా మరణించారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సింగర్ గా తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న గోగులమండ రాజు హైదరాబాదులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 43 సంవత్సరాలు. అయితే ఈయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గోగులమండ రాజు చనిపోవడంతో పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాలోని “తారా తళుకు తారా” అనే పాటను ఈయనే పాడారన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇంత చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం.. వారి కుటుంబం ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కుటుంబానికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Bigg Boss 9 Promo: హీటెక్కిన కెప్టెన్సీ టాస్క్.. విజేత ఎవరంటే?
అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం.. గోగులమండ రాజు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులో గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మృతదేహం స్వగ్రామం చిట్టంవరం కు చేరుకుంది. గ్రామస్తులతో పాటు పలువురు ప్రముఖులు , ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈరోజు(శనివారం) ఆయన అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సమాచారం.
ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన కష్టపడి పీజీ వరకు పూర్తి చేశారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఇష్టం ఉండడంతో స్కూల్లో చదువుకునేటప్పుడే పలు సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఎన్నో అవార్డులను కూడా గెలుచుకున్నారు. కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నప్పుడే ఆర్కెస్ట్రా, పాటల పోటీలలో పాల్గొంటూ సింగర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు రాజు.
ఇకపోతే పాడుతా తీయగా కార్యక్రమంలో కూడా పాల్గొని దివంగత గాయకులు బాలసుబ్రమణ్యం దృష్టిలో పడిన ఈయన.. తొలిసారి వెంకటేష్ నటించిన లక్ష్మీ చిత్రంలో పాట పాడి సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు.. సింహ సినిమా తోపాటు మరెన్నో చిత్రాలలో పాటలు పాడారు. ఎక్కువగా ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు నిర్వహించి పలువురికి ఉపాధి కల్పించేవారు . హైదరాబాదులో స్థిరపడ్డారు. ఇకపోతే ఆయన మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులే కాదు గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించడం అందరిని చలింప జేస్తోంది. ఏదేమైనా గుండెపోటుతో మరొక సింగర్ మరణించడం బాధాకరం అని చెప్పాలి.