Varun Tej Italy:కొరియన్ కనకరాజు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్ తేజ్ ఇపుడు ఇటలీ వెకేషన్ ని తన ఫ్యామిలీతో కలిసి ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.మాములుగా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ తప్ప పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను పెద్దగా షేర్ చేయడు.అలాంటిది ఒక్కసారిగా వరుణ్ తేజ్ ,లావణ్యా త్రిపాటీల పొటోలు ఇలా బయటకు వచ్చాయో లేదో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
భార్య లావణ్య త్రిపాఠి, చిన్నారి వాయువ్ తేజ్‌తో కలిసి వరుణ్ తేజ్ ఇటలీ ట్రిప్‌కు వెళ్ళాడు.ఇక అక్కడ ఇటలీ అందాలను ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో గడిపిన అందమైన క్షణాలను వరుణ్ తేజ్ తన అభిమానులతో పంచుకున్నారు. పెద్దగా హంగామా లేకుండా, చాలా న్యాచురల్ గా ఈ ఫొటోలు ఉండటంతో ఫిదా అవుతున్నారు మూవీ లవర్స్.ముఖ్యంగా వాయువ్ తేజ్‌కు సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ని చూసి తెగ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలం తమ రిలేషన్‌ను సీక్రెట్ గా ఉంచిన ఈ జోడీ ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్లిని ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో గ్రాండ్‌గా జరుపుకున్నారు.దాంతో ఇపుడు ఈ జోడీ మళ్ళీ తమ కొడుకు వాయువ్ తేజ్ తో మళ్ళీ ఇటలీకే వెళ్ళడం నిజంగా ఒక స్పెషల్ అనే చెప్పాలి.
ఇక ఈ ఫొటోల్లో వరుణ్ తేజ్ చాలా క్యాజువల్‌గా కనిపిస్తుండగా,లావణ్య స్టైలిష్‌గా కనిపిస్తుంది.ఇక ఈ ఫోటోల్లో అసలు హైలెట్ మాత్రం చిన్నారి వాయువ్ తేజ్ అనే చెప్పాలి.దీంతో “మెగా ఫ్యామిలీలో మరో చిన్న మెంబర్‌తో ఇలాంటి మూమెంట్స్ ఎప్పటికీ స్పెషల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు మెగా ఫాన్స్.
వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘కంచె’ నుంచి ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్2’, ‘గద్దలకొండ గణేష్’, ‘గని’, ‘గాండీవధారి అర్జున’ వరకు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలని ట్రై చేశాడు.
ముఖ్యంగా ‘ఫిదా’లో సాయి పల్లవితో కలిసి చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ వరుణ్ తేజ్ కెరీర్‌లో స్పెషల్ ఫిలిమ్ అనే చెప్పాలి. అలాగే వెంకటేష్‌తో కలిసి చేసిన ‘f2’‘f3’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాయి.ఇక వరుస ఫ్లాపుల తర్వాత కొరియన్ కనకరాజు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో వచ్చే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ALSO READ:మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!
ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’,వంటి సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది. వరుణ్, లావణ్య కలిసి నటించిన ‘మిస్టర్’ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారినట్లు గతంలోనే ఈ జోడీ చెప్పుకొచ్చింది.మొత్తానికి పెళ్లి చేసుకున్న ఇటలీకే మళ్ళీ కొడుకు వాయువ్ తేజ్ తో కలిసి వెళ్ళడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ:మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!