E-Paper
Advertisement

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్
Advertisement

O Naa Siddhayya:సినిమా పాటలు అంటే కేవలం ఎంటర్ టైన్ చేసేవే కావు.వాటి వెనుక మంచి కథ కూడా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు అలాంటి పాటనే ఒకటి ఆడియన్స్ ని పలకరించేందుకు సిద్దం అయింది. సిద్ధు రెడ్డి, కాత్యాయని జగన నటించిన ఈ పాటకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.ఇక ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా హాజరవడం ఇక్కడ విశేషం .

కందకట్ల క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ పాటను రూపొందించగా రామ్ అద్నాన్ పాటను రాయడంతో పాటు దర్శకత్వం కూడా వహించడం ఇక్కడ మరో విశేషం.ఇక కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించగా.. రామ్ అద్నాన్, శ్రీనిధి కలిసి పాట పాడారు.

Advertisement

టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కాసర్ల శ్యామ్, నల్గొండ గద్దర్, గీతా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరందరూ ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్‌కు తమ విషెస్ తెలిపారు.

ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ

Advertisement

వీరిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ సిద్ధు రెడ్డి తనకు సోదరుడిలాంటి వ్యక్తి అని , సినిమాలు, పాటలు చేయడంతో పాటు సిద్ధు రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల నిర్మించడం, అవసరమైన వారికి సాయం చేయడం లాంటి పనులు చేయడంలో ముందుటారని ఆకాశానికి ఎత్తేశారు.ముఖ్యంగా 300 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించడం మంచి విషయమని అన్నారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి చేసిన ‘ఓ నా సిద్ధయ్య’ పాట మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ

ఇక చంద్రబోస్ మాట్లాడుతూ సిద్ధు రెడ్డితో పరిచయం ఎక్కువ కాలం కాకపోయినా.. చాలా దగ్గరి అనుబంధం ఏర్పడిందని చెప్పారు. సిద్ధు కోసం తాను కూడా ఓ పాట రాశానని, అది త్వరలోనే రాబోతుందని తెలిపారు. రామ్ అద్నాన్ చేసిన ‘ఓ నా సిద్ధయ్య’ పాట ముందుగా విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పాటలో సిద్ధు రెడ్డి బాగా నటించారని చెప్పారు. బయట ఎలా ఉంటారో.. తెరపై కూడా సిద్ధు అలాగే కనిపిస్తారని చెప్పుకొచ్చారు చంద్రబోస్.

ఇక కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే తనతో మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పారు. పాటలో సిద్ధు బాగా నటించారని, రామ్ అద్నాన్ కూడా చక్కగా తెరకెక్కించారని అన్నారు. ఈ పాటతో సిద్ధు రెడ్డికి మంచి గుర్తింపు రావాలని కోరుకున్నారు.

300 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్

అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం 300 మంది ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించిన సంగతి. దీని వెనుక ఉన్న కారణాన్ని సిద్ధు రెడ్డి స్వయంగా చెప్పారు. ఒకసారి ఓ మహిళ తన భర్త ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పి సాయం కోరిందట. తనకు చేతనైనంత సాయం చేసినా.. హాస్పిటల్ ఖర్చులు దాదాపు రూ.5 లక్షల వరకు వెళ్లాయని తెలిపారు. అప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలకు ఇన్సూరెన్స్ ఎంత ఉపయోగపడుతుందో అర్థమైందని చెప్పారు. అందుకే ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేయించాలనే ఆలోచన వచ్చిందని వివరించారు.

ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది 

‘ఓ నా సిద్ధయ్య’ పాటను కేవలం ఒక పాటగా కాకుండా.. చిన్న సినిమా చేసినట్టుగా అనిపించిందని సిద్ధు రెడ్డి చెప్పారు. ఈ పాట కోసం రామ్, అరుణ్ ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. కాత్యాయని కూడా తన పాత్రను చాలా బాగా చేసిందని ప్రశంసించారు. త్వరలోనే పాటను పూర్తిగా విడుదల చేయబోతున్నామని చెప్పారు. ప్రేక్షకులు పాటను ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకున్నారు.నటి కాత్యాయని మాట్లాడుతూ సిద్ధు రెడ్డితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పాట చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

ఇక రామ్ అద్నాన్ మాట్లాడుతూ సిద్ధు రెడ్డి జీవితంలోని కొన్ని విషయాలను ఆధారంగా చేసుకుని ఈ పాటను రూపొందించామని చెప్పారు. ఇందులో కుటుంబం, భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, కలిసి కష్టాలను ఎదుర్కొనే విధానం వంటి అంశాలను చూపించామని తెలిపారు. అందుకే ఈ పాట చాలా మందికి తమ జీవితాన్ని గుర్తు చేస్తుందని భావిస్తున్నానన్నారు.

ప్రజా నాయకుడితో పాటు హీరో కూడా

నల్గొండ గద్దర్ మాట్లాడుతూ సిద్ధు రెడ్డిలో ఒక ప్రజా నాయకుడితో పాటు హీరో కూడా కనిపిస్తారని అన్నారు. పేదల కోసం నిలబడే మంచి మనసు ఆయనకు ఉందని చెప్పారు. ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. గీతా భాస్కర్ కూడా సిద్ధు రెడ్డితో తక్కువ సమయం పనిచేసినా.. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చెప్పారు.

ALSO READ:సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

మొత్తానికి ‘ఓ నా సిద్ధయ్య’ టైటిల్ పోస్టర్ లాంచ్‌తో ఈ పాటపై ఆసక్తి మొదలైంది. కుటుంబ అనుబంధాలు, భార్యాభర్తల ప్రేమ, జీవితంలో ఎదురయ్యే కష్టాలు.. ఇలా ఎమోషన్‌కు సంబంధించిన అంశాలతో పాటను రూపొందించినట్లు టీమ్ చెబుతోంది. మరి పాట పూర్తిగా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Tags

Related News

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

Big Stories

Advertisement
×