Meenakshi Chaudhary:ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యేకించి తమ వ్యక్తిగత రక్షణ , ఫోటోలను, వాయిస్ ను ఎక్కడ ఉపయోగించకుండా అశ్లీల , అసభ్యకరమైన కంటెంట్ ను వాడకుండా ఉండేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సెలబ్రిటీలందరూ సమర్పించిన పిటిషన్ ను న్యాయస్థానం పరిశీలించి, వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే మీనాక్షి కూడా తనకు సంబంధించిన అశ్లీల , అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది మీనాక్షి.
మీనాక్షి తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ, తన చిత్రాలను ఏ విధంగా కూడా ఉపయోగించకూడదని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం దీనిని విచారించిన ధర్మసనం అశ్లీల కంటెంట్ ను తొలగించాలని ఆదేశించినప్పటికీ.. ఏకపక్ష దశలో తన ఫోటోలకు సంబంధించి పూర్తిస్థాయి నిషేధాజ్ఞ ఉత్తర్వులను జారీ చేయలేమని స్పష్టం చేసింది.
ముఖ్యంగా మీనాక్షి పేరును వాణిజ్య ప్రయోజనాలు డబ్బు సంపాదించడం కోసం ఎలా వాడుకుంటున్నారో చూపించమని ఆమె తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యక్తిత్వం హక్కులకు సంబంధించిన వ్యవహారాలలో బ్లాంకెట్ ఇంజంక్షన్(అన్నింటికి వర్తించేలా పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు) జారీ చేయలేము అని స్పష్టంగా చెబుతున్నా.. ఎవరైనా సరే మీ చిత్రాలు, లేదా ఇతర అంశాలను ఉపయోగించి, డబ్బు సంపాదిస్తున్నారని విషయాన్ని ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపించాల్సి ఉంటుంది అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసును వాయిదా వేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. మరి ఆలోపు మీనాక్షి సరైన ఆధారాలను సమర్పిస్తుందా ? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది.
ALSO READ:సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!
మీనాక్షి నటిస్తున్న చిత్రాల విషయానికే వస్తే.. ఈ ఏడాది ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన.. ఈమె ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య హీరోగా , కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న వృషకర్మ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు బాలీవుడ్ కామెడీ సీక్వెల్ గా వస్తున్న భాగమ్ భాగ్ 2 సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వీటితో పాటు జాన్ అబ్రహం తో కలిసి ఫోర్స్ 3లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇది యాక్షన్ కాప్ – థ్రిల్లర్ గా రాబోతోంది. అలాగే నటుడు విక్రమ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న ఈమె.. మరో రెండు మూడు చిత్రాలలో కూడా అవకాశాలు అందుకున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా మీనాక్షి చౌదరి వరుస అవకాశాలు అందుకుంటూ.. భాషతో సంబంధం లేకుండా.. పాన్ ఇండియా హీరోయిన్గా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది మీనాక్షి చౌదరి. ఈ సమయంలోనే ఈమె ఫోటోలు అసభ్యకరంగా వాడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.