E-Paper
Advertisement

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!
Advertisement

Anupama Bridal: అనుపమ పరమేశ్వరన్ ..మళయాళ ప్రేమమ్ తో ఆడియన్స్ గుండెల్లో దూరిపోయిన ఈ అమ్మడు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా రెండు చేతులా సంపాదించేస్తుంది.ఇదిగో తాజాగా ఇలాగే ఓ జువెలరీ బ్రాండ్ కోసం అనుపమ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పింక్ కలర్ శారీలో, ఒంటినిండా బంగారు నగలు వేసుకుని అనుపమ అచ్చం పెళ్లికూతురిలా కనిపించిందనడంలో సందేహం లేదు .మెడలో చోకర్, నెక్లెస్, చెవులకు జుంకాలు, నుదుటిపై పాపిడా, నడుముకు వడ్డాణం.. ఇలా ట్రెడిషనల్ జువెలరీతో అభిమానులని ఫిదా చేస్తుంది. పైగా చేతిలో పూలతో డిజైన్ చేసిన గొడుగు పట్టుకుని నవ్వుతూ ఇచ్చిన పోజ్ ఎవర గ్రీన్ అని చెప్పాలి.

Advertisement

‘రివా వెడ్డింగ్ సిగ్నేచర్స్’ క్యాంపెయిన్‌లో భాగంగా

ఈ షూట్ తనిష్క్ జువెలరీకి సంబంధించిన ‘రివా వెడ్డింగ్ సిగ్నేచర్స్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఫొటోషూట్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి అంటే ఎవరో చెప్పినట్టుగా కాకుండా.. మనకు నచ్చినట్టుగా, మన స్టైల్‌లో జరుపుకోవాలనే కాన్సెప్ట్‌తో ఈ క్యాంపెయిన్‌ను రూపొందించారట.

Advertisement

అయితే ఈ క్యాంపెయిన్‌లో జువెలరీ కంటే అనుపమ అందమే ఎక్కువగా హైలైట్ అవుతోందని అంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఆమె చిరునవ్వు, ట్రెడిషనల్ లుక్ ఫొటోలకు మంచి అందాన్ని తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇక ఈ ఫొటోలు చూసిన అభిమానులు ‘అచ్చం పెళ్లికూతురిలా ఉంది’, ‘చాలా అందంగా ఉంది’, ‘ఈ లుక్ అనుపమకు పర్ఫెక్ట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ట్రెడిషనల్ లుక్స్ కొత్తేమీ కాదు

నిజానికి అనుపమకు ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్ కొత్తేమీ కాదు. ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘18 పేజెస్’ వంటి సినిమాల్లో కూడా ఆమె తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా మోడ్రన్ అమ్మాయిగా అలరించి నేనేదైనా చేయగలను అంటూ ప్రూవ్ చేసుకుంది.

ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా అనుపమ యాక్టివ్‌గా ఉండటం విశేషం. చీరలో కనిపించినా, మోడ్రన్ డ్రెస్‌లో కనిపించినా ఆమె ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ పెళ్లికూతురి లుక్ కూడా అదే రేంజ్‌లో వైరల్ అవుతోంది.

ALSO READ:రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

ఒక్క ఫొటోషూట్‌తోనే సోషల్ మీడియాలో వైరల్ 

మొత్తానికి పింక్ శారీ, బంగారు నగలు, చేతిలో పూల గొడుగు, ముఖంలో అందమైన చిరునవ్వుతో అనుపమ పరమేశ్వరన్ అచ్చం పెళ్లి కూతురిలా కనిపించింది. మొత్సితానికి తాజాగా  సినిమా అప్‌డేట్ లేకపోయినా.. ఒక్క ఫొటోషూట్‌తోనే సోషల్ మీడియాలో మరోసారి తన క్రేజ్ ఏంటో చూపించేసింది ఈ మల్లూ బ్యూటీ .

Tags

Related News

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!

Big Stories

Advertisement
×