E-Paper
Advertisement

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు.. 15, 16 మోడళ్లను కొనేముందు ఇవి చెక్ చేయడం మర్చిపోవద్దు!
Advertisement

Refurbished iPhone: మార్కెట్‌లోకి కొత్త ఐఫోన్ వచ్చినప్పుడల్లా పాత మోడళ్ల ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కొత్త ఫోన్ కోసం ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునేవారికి Refurbished ఐఫోన్లు ఒక ఆప్షన్‌గా మారాయి. ముఖ్యంగా ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడళ్లు అసలు ధరతో పోలిస్తే.. తక్కువకే దొరికే అవకాశముంది. అయితే ఇవి కొత్త ఫోన్లు కావు కాబట్టి.. కొనేముందు కొన్ని విషయాలు తప్పక చెక్ చేయాలి.

ఐఫోన్ 15 ధర ఎంత?

2023లో రూ.79,900 ప్రారంభ ధరతో వచ్చిన iPhone 15 ఇప్పుడు Refurbished ఫోన్ల మార్కెట్లో తక్కువ ధరకే కనిపిస్తోంది. మ్యాపుల్ స్టోర్‌లో 128GB ఎల్లో కలర్ మోడల్ రూ.42,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 83 శాతంగా ఉండగా.. 12 నెలల వారంటీ ఉంది. క్యాషిఫైలో 128GB బ్లూ కలర్ మోడల్ రూ.41,999గా ఉంది. దీనికి సాధారణంగా 6 నెలల వారంటీ ఉండగా.. అదనంగా మరో 6 నెలల వారంటీ తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Also Read: Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!

iPhone 16పై కూడా తగ్గింపు..

2024లో రూ.79,900 ప్రారంభ ధరతో వచ్చిన iPhone 16 కూడా Refurbished ఫోన్‌గా తక్కువ ధరకే దొరుకుతోంది. మ్యాపుల్ స్టోర్‌లో 128GB రోజ్ కలర్ మోడల్ రూ.52,999గా ఉంది. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 91 శాతం కాగా, 12 నెలల వారంటీ ఉంది. క్యాషిఫైలో 128GB బ్లాక్ కలర్ మోడల్ రూ.54,999కు అందుబాటులో ఉంది. ఇందులో 6 నెలల వారంటీ ఉండగా, అదనంగా మరో 6 నెలల వారంటీ తీసుకోవచ్చు. అంటే ధరతో పాటు బ్యాటరీ, వారంటీని కూడా పోల్చడం ముఖ్యం.

రిఫర్బిష్డ్ అంటే?

Advertisement

Refurbished ఫోన్ అంటే ఇప్పటికే ఎవరో ఉపయోగించిన ఫోన్‌ను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ విక్రయించే ఫోన్. అందుకే ప్రతి ఫోన్ పరిస్థితి ఒకేలా ఉండకపోవచ్చు. బ్యాటరీ హెల్త్, ఫోన్ బాడీ పరిస్థితి, స్క్రీన్, కెమెరా, సాఫ్ట్‌వేర్, వారంటీ, తిరిగి ఇచ్చే నిబంధనలు వంటి వివరాలను ముందే చూడాలి.

కొనేముందు చూడాల్సినవి..

కొత్త మోడల్ కోసం చూస్తున్నవారికి iPhone 17 ప్రస్తుతం యాపిల్ ఇండియాలో 256GB మోడల్‌కు రూ.99,900 నుంచి ఉంది. కాబట్టి.. పాత మోడల్ రిఫర్బిష్డ్ ఫోన్ ధరను చూసేటప్పుడు కొత్త ఫోన్ ధరతో కూడా పోల్చి చూడటం మంచిది. ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం 80 శాతానికి దగ్గరగా ఉంటే భవిష్యత్తులో బ్యాటరీ మార్చాల్సిన ఖర్చు రావచ్చు. అలాగే ఫోన్‌లో అసలు విడిభాగాలే ఉన్నాయా, గతంలో ఏమైనా మరమ్మతులు జరిగాయా అనే వివరాలు అందుబాటులో ఉంటే వాటిని కూడా పరిశీలించాలి.

Also Read: బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

Tags

Related News

రీఛార్జ్ బాదుడుకి చెక్.. కేంద్రం సంచలన నిర్ణయం.. దెబ్బకు దిగిరానున్న ప్లాన్ల ధరలు!

Jio, Vi యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే బుక్ చేసుకోండి!

ఆడవాళ్ల మనసు దోచే టైటాన్ వాచ్‌లపై..30% డిస్కౌంట్!

హైయర్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లపై..40% డిస్కౌంట్!డోంట్ మిస్

రూ.5వేలకే 8.5 కేజీల వాషింగ్ మెషీనా? ఇక బట్టల గోలకి ఫుల్ స్టాప్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న GOBOULT Mustang Torq..ఈ ఇయర్ బడ్స్ క్రేజే వేరబ్బా!

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

Big Stories

Advertisement
×