E-Paper
Advertisement

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!
Advertisement

Sigma Trailer: తండ్రి విజయ్ నటుడిగా సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకుని తమిళ దళపతిగా పేరు తెచ్చుకుంటే కొడుకు జేసన్ మాత్రం మెగా ఫోన్ పట్టి సందీప్ కిషన్ హీరోగా సిగ్మా అనే యాక్షన్, క్రైమ్, అడ్వెంచర్ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక దర్శకుడిగా జేసన్‌కు ఇదే తొలి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈక్రమంలో ఇప్పటికే ‘సిగ్మా’ నుంచి టీజర్, పాటలు వచ్చి సినిమాపై ఓ రేంజ్‌లో బజ్ తీసుకురాగా ఇప్పుడు తాజాగా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ .ఇక ట్రైలర్ చూస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమయిపోతుంది కూడా.

Advertisement

జూదం, మత్తు.. కాయిన్‌కి రెండు వైపుల్లాంటివి

ట్రైలర్‌ను చూస్తుంటే కథ మొత్తం క్యాసినో, జూదం, డ్రగ్స్, హవాలా డబ్బు చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. ‘‘జూదం, మత్తు.. కాయిన్‌కి రెండు వైపుల్లాంటివి.. వీటిని అలవాటు చేస్తే కోట్లు సంపాదించొచ్చు’’ అంటూ వచ్చే డైలాగ్‌తో అసలు కథ ఏంటనేది ఆసక్తిగా చూపించారు. ఆ తర్వాత రూ.500 కోట్ల వ్యవహారం తెరపైకి రావడం బట్టి చూస్తే జేసన్ సినిమాని భారీ స్కేల్ లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో కూల్‌గా ఉండే కుర్రాడిగా కనిపిస్తుండగా ఫరియా అబ్దుల్లా ఇందులో రేడియో జాకీగా నటిస్తుందని అర్థం అవుతుంది. ఇక వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ కాస్త సరదాగా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది.

అయితే ట్రైలర్ సాగుతుండగానే ‘‘ఓడిపోవడం నాకు కొత్త కాదు.. కానీ మోసం చేసే వాళ్లను మాత్రం వదిలేది లేదు’’ అంటూ తన మాస్ యాక్షన్ షోలో కి దిగడం, ఆపై గన్స్, ఫైట్స్, ఛేజింగ్స్‌ చూస్తుంటే సినిమాలో సందీప్ రెండు వేరియేషన్స్ లో కనిపించబోతున్నాడని అర్థం అవుతుంది.

జేసన్ సంజయ్ గురించే చర్చ

అయితే అందరికంటే ఎక్కువగా ఇప్పుడు జేసన్ సంజయ్ గురించే చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ కొడుకు అనే ట్యాగ్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న జేసన్.. మొదటి సినిమాకే ఇలాంటి భారీ యాక్షన్ కథను సెలెక్ట్ చేసుకోవడం చూస్తుంటే స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

క్రైమ్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలకు తెలుగులో ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందనడంలో సందేహం లేదు. ‘మైఖేల్’, ‘ఏజెంట్’ లాంటి సినిమాల్లో ఇలాంటి యాక్షన్ ఎలిమెంట్స్ మనం చాలానే చూశాం. అయితే ‘సిగ్మా’లో క్యాసినో మాఫియా, డ్రగ్స్, డబ్బు ఇలా మిక్స్ అయి ఉండటంతో కథ కాస్త డిఫరెంట్‌గా ఉందనే అనిపిస్తోంది .ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్‌వీఆర్ సినిమా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో 

మొత్తానికి ‘సిగ్మా’ ట్రైలర్ చూస్తే సందీప్ కిషన్‌కు మరో యాక్షన్ మూవీ రెడీ అయినట్టే కనిపిస్తోంది. అదే సమయంలో జేసన్ సంజయ్ కూడా తన మొదటి సినిమాతోనే డైరెక్టర్‌గా ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో చూడాలి. ట్రైలర్ మాత్రం సినిమాపై ఆసక్తిని బాగానే పెంచేసింది. మరి ఈ  యాక్షన్ ఎంటర్ టైనర్  ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో  అక్టోబర్ 2న తెలుస్తుంది!

 

Tags

Related News

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

Big Stories

Advertisement
×