E-Paper
Advertisement

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!
Advertisement

Rashmika Mandanna:రష్మిక మందన్నా..నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ రౌడీ పార్ట్నర్ పెళ్ళయ్యాక ఇపుడు మరింత జోరు చూపిస్తుంది. అవును ..మొన్నటికి మొన్న ms సుబ్బలక్ష్మి సినిమాకి కొబ్బరికాయ కొట్టేసిన ఈ కన్నడ కస్తూరి ఇపుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం సినిమా కాదండోయ్ .. తనకి ఎంతో ఇష్టమైన అనిమే కోసం.

మిలాన్‌లో జరగనున్న ‘Vogue World’ ఈవెంట్‌కు ముందు రష్మిక కోసం ‘Vogue’ ఓ స్పెషల్ ఫ్యాషన్ వీడియోను రూపొందించింది. అక్టోబర్ కవర్ స్టార్‌గా రష్మికను పరిచయం చేస్తూ చేసిన ఈ షూట్‌లో రష్మిక లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.అనిమే వరల్డ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ వీడియోలో రష్మిక డిఫరెంట్ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

12 ఏళ్ల వయసులో ‘Naruto’ పరిచయం

నిజానికి రష్మికకు చిన్నప్పటి నుంచే అనిమే అంటే చాలా ఇష్టమట. ఆమెకు 12 ఏళ్ల వయసులో ‘Naruto’ పరిచయం అయిందట. అప్పటి నుంచి అనిమే చూడటం అలవాటుగా మారిపోయిందని చెప్పింది. ఇక ఇప్పటివరకు 40కి పైగా అనిమే సిరీస్‌లు చూసినట్టు రష్మిక తెలపడం ఇక్కడ విశేషం.

Advertisement

అంతేకాదు.. ఒకసారి అనిమే చూడటం మొదలుపెడితే ఆపకుండా ఏకంగా 25 ఎపిసోడ్లు కూడా చూసిన సందర్భాలు ఉన్నాయట. దీంతో రష్ కి అనిమేపై ఉన్న ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు చూడని కొన్ని కొత్త లుక్స్‌లో

ఇదిగో ఈ అనిమే ఇష్టాన్నే ‘Vogue’ తన తాజా ఫ్యాషన్ వీడియోలో ఉపయోగించింది. రష్మికను ఇప్పటివరకు చూడని కొన్ని కొత్త లుక్స్‌లో చూపించి మెస్మరైజ్ చేసింది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, మేకప్, జ్యువెలరీతో ఆమెను అనిమే క్యారెక్టర్‌లా కనిపించేలా చేశారు. దీంతో రష్మిక ఫ్యాన్స్ కూడా ఈ కొత్త లుక్ చూసి తెగ సంబరపడుతున్నారు.

సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘పుష్ప’ సిరీస్‌లో శ్రీవల్లి పాత్రతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇపుడు తన రౌడీ పార్ట్నర్ విజయ్ దేవరకొండతో రణబాలి అనే సినిమాలో జయమ్మ అనే పాత్రలో కనిపించనుంది.

సినిమాలు చేస్తూ బిజీగా

ఇక టాలీవుడ్ లో మాత్రమే కాదు..బాలీవుడ్‌లో కూడా రష్మిక తన జోరు చూపిస్తుంది. రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన యానిమల్ సినిమాలో అలాగే చావా సినిమాలతో హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ప్రస్తుతం తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ALSO READ:ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

ఇక ‘Vogue’ కోసం చేసిన ఈ ప్రత్యేక షూట్‌లో రష్మిక ధరించిన డ్రెస్, జ్యువెలరీ కూడా ప్రత్యేకంగా నిలిచాయి. చోకర్, నెక్లెస్, ఇయరింగ్స్, బ్రేస్‌లెట్, రింగ్స్‌తో ఆమె లుక్‌ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. . మొత్తం షూట్ చూస్తే సాధారణ ఫ్యాషన్ ఫోటోషూట్‌లా కాకుండా అనిమే ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తోందనడంలో సందేహం లేదు .

Tags

Related News

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!

Big Stories

Advertisement
×