E-Paper
Advertisement

సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. ?

సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. ?
Advertisement

Anu Emmanuel: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏదో ఒక విషయం ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది..ఈ సోషల్ మీడియా కారణంగానే కనుమరుగైన సెలబ్రిటీలు కూడా మళ్లీ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది బరువు పెరిగినా లేదా బక్క చిక్కిపోయినా లేదా ఇంకెవరితోనైనా కలిసి తిరిగినా సరే.. అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటారు. అంతేకాదు కొంతమంది హీరోయిన్లు లేదా హీరోలు ఇండస్ట్రీలో కనిపించకపోతే మాత్రం ఇక ఇండస్ట్రీకి దూరమయ్యారా అనే కామెంట్స్ రావడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఒకప్పుడు అందం, అభినయంతో ఆకట్టుకుని.. కుర్రకారు ఆరాధ్య దేవతగా నిలిచిన ఒక హీరోయిన్ సడన్గా ఇండస్ట్రీలో కనిపించకపోయేసరికి.. ఈమె ఇండస్ట్రీకి దూరం అయ్యిందా? అనే కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో.. ఎట్టకేలకు ఆమె దిగి వచ్చింది. తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై స్పందించింది.

సోషల్ మీడియా అసత్య ప్రచారంపై స్పందించిన బ్యూటీ..

అను ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ..” నేను సినిమాలకు దూరం అయ్యానని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. నేను సినిమాలకు దూరం కాలేదు.. కాను కూడా.. నటనను వదిలేసే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతం నాకు నచ్చే కథలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా నాలోని నటనా ప్రతిభను చూపించే మంచి కథ దొరికితే మళ్ళీ కొత్త సినిమాతో మీ ముందుకు వస్తాను” అంటూ అను ఇమ్మాన్యుయేల్ స్పందించింది. మొత్తానికి అయితే సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన అమ్మడు తనపై వస్తున్న అసత్య ప్రచారానికి స్పందించి చెక్ పెట్టింది.

అను ఇమ్మాన్యుయేల్ కెరియర్..

Advertisement

మలయాళం సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె.. తొలిసారి 2016లో నాని హీరోగా నటించిన మజ్ను అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది . మొదటి సినిమాతోనే అందం , అమాయకత్వం, చలాకీతనం, సహజమైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.

ALSO READ:ఓటిటిలోకి అగధ స్ట్రిమింగ్ ఎప్పటినుంచంటే..?

అల్లు హీరోతో ఎఫైర్ రూమర్స్..

Advertisement

ఇకపోతే సినిమాలలో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ రూమర్స్ తో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే . ఇందులో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు
అప్పుడప్పుడు బయట కనిపించడంతో ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వినిపించిన విషయం తెలిసిందేl. అయితే సడన్గా అల్లు శిరీష్ తాను వివాహం చేసుకోబోతున్న అమ్మాయి గురించి ప్రకటించడం, పెళ్లి చేసుకోవడం అన్నీ అయిపోయాయి. అటు అను ఇమ్మాన్యుయేల్ ఒంటరిగా సరైన పాత్రల కోసం ఎదురుచూస్తూ కెరియర్లో మంచి బ్రేక్ అందుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ . మరి అమ్మడికి మంచి స్టార్డం అందించి పెట్టే పాత్ర ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

Related News

వామ్మో.. మౌనిరాయ్ నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

Big Stories

Advertisement
×