Actor Death: ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడుస్తున్నారు. చిన్న వయసులోనే గుండెపోటు వీరిని కబలిస్తే.. మరికొంతమంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడుస్తున్నారు. అయితే ఇంత డబ్బు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు వెంటాడడానికి కారణం సినిమాల పైన దృష్టి పెట్టడమే అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే ఫిట్ గా, యంగ్ గా ఉండడానికి నిత్యం వ్యాయామాలు చేస్తూ.. డైట్ అంటూ సరిగ్గా తినకపోవడం.. మరొకవైపు ఆరోగ్యంపై తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని.. వ్యాధి తీవ్రతరం అయ్యాక ఇలా స్వర్గస్తులవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులనే కాదు సినీ ఇండస్ట్రీని కూడా కలచి వేస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న 100 సంవత్సరాలు సంపూర్ణ జీవితము గడిపిన జూన్ లాకోహర్ట్ వృద్ధాప్య కారణాలతో మరణించగా.. ఇప్పుడు 70 సంవత్సరాలు సినీ నటుడు స్వర్గస్తులయ్యారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్జోర్న్ ఆండ్రీసెన్. 1971లో వచ్చిన ‘డెత్ ఇన్ వెనిస్’ సినిమాలో టాడ్జియో అనే పాత్రతో ఏకంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈయన మరణానికి గల కారణం మాత్రం ఇంకా తెలియలేదు. నటనకు మించి, ఆండ్రీసెన్ ఒక నిష్ణాతుడైన పియానిస్ట్.. అలాగే సంగీత కారుడు కూడా. డెత్ ఇన్ వెన్ ఇస్ చిత్రం విడుదలైన తర్వాత జపాన్ లో పాప్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు..అలాగే స్పెన్ ఎరిక్స్ డాన్స్ బాండ్ తో విస్తృతంగా పర్యటించారు కూడా.
బ్జోర్న్ ఆండ్రీసెన్ విషయానికొస్తే 1955 జనవరి 26న స్వీడన్ లో జన్మించారు తల్లి బార్ర్బో ఎలిసబెత్ ఆండ్రీసెన్ ఈయనకు 10 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. ఇక తల్లితరపు తాతామామల దగ్గరే పెరిగాడు.. పాఠశాల విద్యలో కొంత భాగం డెన్మార్కులోని బోర్డింగ్ స్కూల్లో పూర్తి చేసిన ఈయన.. ఆ తర్వాత స్టాక్ హోమ్ లోని అడాల్ఫ్ ఫ్రెడ్రిక్ సంగీత పాఠశాలలో చదివారు. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1983లో సుసన్నా రోమన్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ 1987 లోని విడాకులు తీసుకున్నారు. ఈయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే ఈయన కుమారుడు ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్తో మరణించాడు. కొడుకు మరణంతో నిరాశ లోకి వెళ్లిపోయిన ఈయన.. ఆ బాధ నుంచి మళ్లీ తేరుకోలేకపోయారు. అయితే 2020లో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకును మరణాంతర జీవితంలో మళ్లీ కలుస్తానని నమ్ముతున్నాను అంటూ తెలిపారు. ఇక ఈయన కూతురు రాబిన్ వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. ఇప్పుడు ఆండ్రిసన్ కి ఇద్దరు మనవరాలు ఉన్నారు.
నటుడుగానే కాకుండా ఒక ప్రొఫెషనల్ సంగీత కారుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా , సంగీతకారుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన నేడు మరణించడంతో సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది.
ALSO READ:Bigg Boss 9: పాపం పచ్చళ్ల పాప.. ఎన్ని కలలు కంది.. ఈ ట్రోల్స్ ఎక్కడ చూడలేదు భయ్యా!