BigTV English
Advertisement

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!


Suriya Venky Atluri MovUpdate: సార్, లక్కీ భాస్కర్‌ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు వెంకీ అట్లూరి. తెలుగు డైరెక్టర్అయిన ఆయన తమిళ్‌ హీరోలతోనే సినిమా చేస్తున్నారు. వరుసగా మూడోసారి కూడా మరో తమిళ్‌ హీరోతో జతకట్టాడు. హీరో సూర్యతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 46 (#Suriya 46) పేరుతో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రం షూటింగ్శరవేగంగా జరుగుతోంది.

ఇది ద్విభాష చిత్రమే

అయితే ఇది పాన్ఇండియా చిత్రమని తెలుగు, తమిళ్తో పాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి ఇందులో పలువురు తెలుగు, తమిళ్నటీనటులు భాగమయ్యారు. అలాగే బాలీవుడ్నటి రివీనా టాండన్కూడా ఇందులో నటిస్తుండటంతో చిత్రం హిందీలో విడుదల అవుతుందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దీంతో సూర్య చిత్రంతో వెంకీ అట్లూరి సారి సూర్య చిత్రంతో పాన్ఇండియా సత్తా చాటబోతున్నాడని అనుకుంటున్నారు. అయితే తాజాగా సిసిమాపై వస్తున్న రూమర్స్మూవీ టీం స్పందించింది. సినిమాని హిందీ విడుదల చేయడం లేదని స్పష్టం చేసింది. “వెంకీ అట్లూరి, సూర్య చిత్రం హిందీతో రిలీజ్ చేయడం లేదు. తెలుగు, తమిళ్‌ ఆడియన్స్‌ కోసమే రూపొందుతున్న ద్విభాష చిత్రమిది.


28 రోజులకే ఓటీటీకి

ఇప్పటికే 55 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఎప్పటిలాగే థియేట్రికల్‌ విండో (థియేట్రికల్ రిలీజ్ డేట్, ఓటీటీ రిలీజ్ డేట్ మధ్య ఉండే టైం) కూడా 28 రోజులేఅంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్నెట్టింట వైరల్అవుతుంది. కాగా నిజానికి హిందీలో మూవీ రిలీజ్ అవ్వాలి అంటే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలి. సినిమా నాలుగు వారాల్లోనే ఓటీటీకి వస్తుండటంతో సినిమాను హిందీలో రిలీజ్ చేయడం లేదట. కాబట్టి సూర్యవెంకీ మూవీ కేవలం తెలుగు, తమిళ్లోనే విడుదల కానుంది. పోస్టు చూస్తుంటే ఇక చిత్రం కన్నడ, మలయాళం భాషలపై కూడా విడుదల అవ్వడం లేదని తేలిపోయింది.

రవీణ టాండన్కీ రోల్

కాగా చిత్రంలో రవీణ టాండన్కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం ఆఫీషియల్ప్రకటన కూడా ఇచ్చేసింది. సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యున్ఫోర్బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. చిత్రానికి జీవీ ప్రకాష్సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఇందులో జీవి ప్రకాష్సోదరి, ఏఆర్రెహమాన్మేనకోడలు భవానీ శ్రీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సార్‌, లక్కీ భాస్కర్వంటి బ్లాక్బస్టర్హిట్చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీంతో చిత్రంపై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్‌, ఇతర తారాగణంకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే టీం వెల్లడించనుంది.

Related News

Tamannaah Bhatia : 5 లక్షల కోసం మా కడుపు కొడుతోంది… తమన్నాపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga: రష్మిక ‘గర్ల్‌ ఫ్రెండ్‌’లో సందీప్‌ రెడ్డి వంగా కీ రోల్‌.. నో చెప్పిన డైరెక్టర్, కారణమేంటంటే

Rajamouli: బాహుబలి సినిమాలో జక్కన్న మెచ్చిన సీన్ అదేనా..అంత ప్రభావితం చేసిందా?

Tollywood: ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ.. ఆ హాట్ ఫోజులు చూశారా!

Dhanya Balakrishna: రొమాన్స్ చేస్తేనే సక్సెస్.. అందుకే సక్సెస్ కాలేదన్న నటి?

Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Big Stories

×