Shreyas Iyer ICU: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డే సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది. గత రెండు రోజులుగా ఐసీయూలోనే శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడట. ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే క్రమంలో బలంగా నేలపై పడిపోయాడు శ్రేయాస్ అయ్యర్. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ పక్కటెముకలు విరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ గాయం నేపథ్యంలో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు చెబుతున్నారు. దీంతో సిడ్నీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రేయాస్ అయ్యర్ చికిత్స పొందుతున్నాడట. రెండు రోజుల నుంచి అతన్ని ఐసీయూలోనే ఉంచారట వైద్యులు. శ్రేయాస్ అయ్యర్ హెల్త్ అప్డేట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా ( Australia vs India, 3rd ODI ) మధ్య జరిగిన మూడవ వన్డేలో తీవ్రంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ) ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వార్త బయటకు వచ్చింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో ఉన్న వార్త తెలియగానే ఆస్ట్రేలియా కు శ్రేయాస్ అయ్యర్ ఫ్యామిలీ వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు దగ్గర ఉండాలన్న నేపథ్యంలో వాళ్లను ఆస్ట్రేలియాకు పంపించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). ప్రస్తుతం వైద్యులు అయితే క్రిటికల్ గా పరిస్థితి ఉందని చెబుతున్నారు. ప్రక్కటెముకల దగ్గర రక్తస్రావం రావడంతో పరిస్థితి విషమించింది అని చెబుతున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో ఉన్న నేపథ్యంలో వెంటనే కోలుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ఐసీయూలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ హెల్త్ విషయంపై తాజాగా కీలక ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). శ్రేయాస్ అయ్యర్ ఐసీయూలో ఉన్నది వాస్తవమేనని తెలిపింది. ఇండియా నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా సిడ్నికి పంపించినట్లు వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ కు ఎలాంటి హాని జరగకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలిపింది. శ్రేయాస్ అయ్యర్ ను కోలుకునేంతవరకు తమ బాధ్యత ఉంటుందని ప్రకటన విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ ఆసీస్ వన్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Shreyas Iyer has been admitted to a hospital in Sydney and is currently in the ICU after suffering internal bleeding caused by a rib cage injury! 🇮🇳🤕
He will remain under observation for 2–7 days, depending on his recovery. 🙏#ShreyasIyer #India #Sydney… pic.twitter.com/FZtRRq9R10
— Sportskeeda (@Sportskeeda) October 27, 2025