BigTV English
Advertisement

Naresh: నరేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

Naresh: నరేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

Naresh: అల్లరి నరేష్.. ఈ పేరుకి ఒకప్పుడు మంచి బ్రాండ్ ఉండేది. అయితే ఆ బ్రాండ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.కానీ కామెడీ మాత్రం మిస్సయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ కామెడీ సినిమాలు ఎక్కువగా చేయట్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన నుండి వచ్చే సినిమాలు కామెడీ వేలో కాకుండా మరోలా ట్రై చేస్తున్నారు. కానీ కామెడీ హీరో యాక్షన్ సినిమాలు చేస్తే వాటిని ప్రేక్షకులు ఆదరించరని ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అయితే తాజాగా అల్లరి నరేష్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.


నరేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్..

మరి ఇంతకీ అల్లరి నరేష్ నటించిన కొత్త మూవీ 12A రైల్వే కాలనీ రిలీజ్ ఎప్పుడంటే.. వచ్చే నెల అనగా నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కాబోతోందని.. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్.. 12A రైల్వే కాలనీ సినిమా విషయానికి వస్తే..అల్లరి నరేష్ హీరోగా.. హార్రర్ ఫిలిం అయినటువంటి పొలిమేర, పొలిమేర -2 సినిమాల్లో నటించిన నటి కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా వస్తున్న ఈ మూవీతో నాని కాసరగడ్డ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించింది ఎవరో కాదు పొలిమేర, పొలిమేర 2 వంటి రెండు సినిమాలకు దర్శకత్వం చేసి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ విశ్వనాథ్ అనిల్.. ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈసారైనా సక్సెస్ కొడతాడా?

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 12A రైల్వే కాలనీ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్, పోస్టర్ విడుదలై ఇప్పటికే జనాల్లో మంచి క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా టైటిల్, టీజర్ లోనే వెన్నులో వణుకు పుట్టించే కథనాన్ని చూపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలా తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో అల్లరి నరేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే నవంబర్ 21న పెద్ద సినిమాలేవి విడుదల కాకపోతుండడంతో 12A రైల్వే కాలనీ మూవీకి ఈ అంశం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరి దీన్ని ప్లస్ చేసుకొని అల్లరి నరేష్ ప్రమోషన్స్ తో ఇరగదీసి సినిమా హిట్ కొడతారా? లేదా? అనేది ముందు ముందు తెలుస్తోంది.


12A రైల్వే కాలనీ..

అయితే చాలా రోజుల నుండి అల్లరి నరేష్ చేసే సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కూడా చూపించడం లేదు.మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. 12A రైల్వే కాలనీ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా..కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా.. నటించగా సాయికుమార్, గెటప్ శీను, సద్దాం, వైవా హర్ష లు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ విభిన్న ఛాయలు కలిగిన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీకి సంక్రాంతి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కాబట్టి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్,పాటలు ఓ రేంజ్ లో ఉంటాయని అర్థం చేసుకోవచ్చు.

ALSO READ: Mass jathara: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అతడే.. ట్రోల్స్ వైరల్.!

Related News

Dhanya Balakrishna: రొమాన్స్ చేస్తేనే సక్సెస్.. అందుకే సక్సెస్ కాలేదన్న నటి?

Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!

Sreeleela: శ్రీ లీలకు భర్త అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలా? మామూలు కోరికలు కాదే?

Darshan: దర్శన్ కు మరణశిక్ష విధించిన సమ్మతమే.. మా బాధ పట్టించుకోండి!

Mega 158: చిరు-బాబీ మూవీలో కోలీవుడ్ స్టార్.. కళ్ళుచెదిరే రెమ్యునరేషన్!

Big Stories

×