BigTV English
Advertisement

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Sreeleela: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీలా (Sreeleela)ప్రస్తుతం మాస్ జాతర(Mass Jathara) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. భాను భోగ వరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి రవితేజ(Ravi teja)శ్రీ లీల జంటగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు.


అమ్మ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండదు..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన సినిమాల విషయంలో ఆమె తల్లి పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీ లీల నటించే సినిమాలలో తన తల్లి స్వర్ణలత (Swarna Latha) చొరవ ఉంటుందని ఆమె స్క్రిప్ట్ విన్న తర్వాత తనుకు నచ్చితేనే శ్రీలీలకు సినిమాలు చేయమని సలహా ఇస్తుందని వార్తలు వచ్చాయి. ఇక శ్రీ లీల ఎన్నో సినిమాలకు కమిట్ అయి తప్పుకున్నారు ఇలా సినిమాల నుంచి తప్పుకోవడం వెనక కూడా ఆమె తల్లి ఉన్నారని అందరూ భావిస్తున్నారు. శ్రీ లీల విషయంలో ఆమె తల్లి బొమ్మరిల్లు మదర్ పాత్ర పోషిస్తుంది అంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై శ్రీ లీలా స్పందించారు.

ఏ అమ్మ బిడ్డ నాశనాన్ని కోరుకోదు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అమ్మను అందరూ బొమ్మరిల్లు మదర్ అంటూ భావిస్తుంటారు నిజానికి నా సినిమాల విషయంలో తన అమ్మ ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం ఉండదని తెలిపారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ నేనే వింటానని నేనే సినిమాలను సెలెక్ట్ చేసుకుంటాను తప్ప అమ్మ ఇన్వాల్వ్మెంట్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఏ అమ్మ కూడా తన బిడ్డ నాశనాన్ని కోరుకోరు కదా అంటూ శ్రీ లీల తల్లి గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలన్నింటిని కొట్టి పారేశారు. ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


అంచనాలను పెంచేసిన అప్డేట్..

ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే భాను భోగావరపు దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక రేపు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాబోతోంది అలాగే ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కావాల్సి ఉండగా అదే రోజు బాహుబలి ది ఎపిక్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 31న ప్రీమియర్లను ప్రసారం చేస్తూ నవంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే శ్రీ లీల రవితేజ నటించిన ధమాకా సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో మాస్ జాతర సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Also Read: Sreeleela: శ్రీ లీలకు భర్త అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలా? మామూలు కోరికలు కాదే?

Related News

Samantha: క్రేజీ కాంబినేషన్ రిపీట్, నందిని సమంతకు ఈ సినిమా హిట్ కీలకం కీలకం

Tamannaah Bhatia : 5 లక్షల కోసం మా కడుపు కొడుతోంది… తమన్నాపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga: రష్మిక ‘గర్ల్‌ ఫ్రెండ్‌’లో సందీప్‌ రెడ్డి వంగా కీ రోల్‌.. నో చెప్పిన డైరెక్టర్, కారణమేంటంటే

Rajamouli: బాహుబలి సినిమాలో జక్కన్న మెచ్చిన సీన్ అదేనా..అంత ప్రభావితం చేసిందా?

Tollywood: ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ.. ఆ హాట్ ఫోజులు చూశారా!

Dhanya Balakrishna: రొమాన్స్ చేస్తేనే సక్సెస్.. అందుకే సక్సెస్ కాలేదన్న నటి?

Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?

Big Stories

×