BigTV English
Advertisement

Mass jathara: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అతడే.. ట్రోల్స్ వైరల్.!

Mass jathara: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అతడే.. ట్రోల్స్ వైరల్.!

Mass jathara:మాస్ మహారాజా రవితేజ (Raviteja) నుండి వస్తున్న తాజా మూవీ ‘మాస్ జాతర’.. ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు అక్టోబర్ 31న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. దాంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మూవీ మేకర్స్ మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ అక్టోబర్ 28న గ్రాండ్ గా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆ స్టార్ హీరో రాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ హీరో పేరు అనౌన్స్ చేయడంతోనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.. మరి ఇంతకీ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్న హీరో ఎవరు? ఎందుకు ఆ హీరో పేరు తీయగానే విమర్శలు వస్తున్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

రవితేజ హీరోగా, శ్రీ లీల (Sree Leela) హీరోయిన్ గా వస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31 విడుదల కాబోతోంది అని ప్రకటించినప్పటికీ అదే రోజు ‘బాహుబలి ది ఎపిక్’ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని.. నవంబర్ 1న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 28 మంగళవారం రోజు హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో గ్రాండ్ గా జరగబోతుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

యూనిట్ పై ట్రోల్స్..

రవితేజ మాస్ జాతర మూవీకి సూర్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు చెప్పడంతోనే చాలామంది నెటిజన్స్ మూవీ మేకర్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు.. మీకు చీఫ్ గెస్ట్ గా పిలవడానికి టాలీవుడ్ హీరో ఎవరు దొరకలేదా..? కోలీవుడ్ హీరోనే దొరికారా.. ? అయినా టాలీవుడ్ హీరో సినిమాకి టాలీవుడ్ నుండి కాకుండా కోలీవుడ్ నుండి హీరోను గెస్ట్ గా పిలవడం ఏంటో? అంటూ విమర్శలు చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ మాస్ జాతర మూవీకి టాలీవుడ్ నుండి సీనియర్ హీరోలని ఎవరినో ఒకరిని పిలవకుండా ఇలా కోలీవుడ్ నుండి హీరోని పిలవడం టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నచ్చడం లేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ నెగెటివిటీ పై మాస్ జాతర మూవీ యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.


మాస్ జాతర మూవీ విశేషాలు..

మాస్ జాతర మూవీ విషయానికి వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈ మూవీ నుండి వచ్చిన పాటలు, టీజర్, పోస్టర్ ఇప్పటికే సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి..సినిమా కూడా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే శ్రీలీల,రవితేజ కాంబోలో వచ్చిన ధమాకా మూవీ హిట్ అవ్వడం తో మరోసారి వీరి కాంబో రిపీట్ అయింది. కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని జనాలు అనుకుంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది విడుదల అయితే గాని చెప్పలేం. ఇక వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ కెరియర్ ఈ సినిమా పైనే ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు.

ALSO READ: DSP: బాబునే మెస్మరైజ్ చేసిన డీఎస్పీ.. మామూలు ముదురువి కాదయ్యో!

Related News

Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!

Sreeleela: శ్రీ లీలకు భర్త అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలా? మామూలు కోరికలు కాదే?

Darshan: దర్శన్ కు మరణశిక్ష విధించిన సమ్మతమే.. మా బాధ పట్టించుకోండి!

Mega 158: చిరు-బాబీ మూవీలో కోలీవుడ్ స్టార్.. కళ్ళుచెదిరే రెమ్యునరేషన్!

Naresh: నరేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

Allu Sirish: అల్లు శిరీష్‌ నిశ్చితార్థం తేదీ ఫిక్స్‌.. ఏ రోజంటే!

Big Stories

×