BigTV English
Advertisement

Vitamin C: ఆరెంజ్ కంటే.. ఎక్కువ విటమిన్ సి ఉన్న పవర్ ఫుడ్స్ ఇవే !

Vitamin C: ఆరెంజ్ కంటే.. ఎక్కువ విటమిన్ సి ఉన్న పవర్ ఫుడ్స్ ఇవే !

Vitamin C: విటమిన్ సి.. దీనిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా అంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి.. అంతే కాకుండా.. కొల్లాజెన్ ఉత్పత్తికి, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడానికి చాలా ముఖ్యమైన పోషకం. విటమిన్ సి గురించి చెప్పగానే చాలా మందికి ముందుగా నారింజ గుర్తుకొస్తుంది. కానీ.. ఆరెంజ్ కంటే కూడా అధిక మొత్తంలో విటమిన్ సి ఉన్న ఆహారాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా ఒక మధ్యస్థాయి ఆరెంజ్‌లో సుమారు 70 నుంచి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీని కంటే ఎక్కువ విటమిన్ సి అందించే ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎర్రటి బెల్ పెప్పర్ :

విటమిన్ సి మొత్తం: ఒక కప్పు తరిగిన ఎర్రటి బెల్ పెప్పర్‌లో సుమారు 190 mg విటమిన్ సి ఉంటుంది. ఇది ఆరెంజ్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఎర్రటి బెల్ పెప్పర్ కంటి ఆరోగ్యానికి మంచిది. అందుకే దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


జామ :
కేవలం ఒక్క జామ పండు లో సుమారు 125 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. జామ పండులో ఫైబర్ , శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి కూడా లభిస్తుంది.

కివీ ఫ్రూట్ :
రెండు చిన్న కివీ పండ్లలో దాదాపు 137 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ పండు పొటాషియం, కాపర్ తో పాటు, మంచి నిద్రకు సహాయ పడే సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

పచ్చి మిరపకాయలు:
అర కప్పు తరిగిన పచ్చి మిరపకాయల్లో సుమారు 108 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇందులో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందుకే ఇది కీళ్లు కండరాల నొప్పితో పాటు నొప్పి నివారణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: షుగర్.. ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా ?

బొప్పాయి:
విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్‌లో బొప్పాయి కూడా ఒకటి. సుమారు 88 మిల్లీ గ్రాముల విటమిన్ సి దీని నుంచి లభిస్తుంది. బొప్పాయిలోని పోషకాలు అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది.

బ్రకోలీ:
ఒక కప్పు తరిగిన బ్రకోలీలో దాదాపు 80 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది ఫైబర్, క్యాన్సర్ ను నిరోధించే గుణాలున్న ఫైటో న్యూట్రియెంట్స్‌తో నిండి ఉంటుంది. అంతే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.

స్ట్రాబెర్రీస్ :

ఒక కప్పు స్ట్రాబెర్రీస్‌లో సుమారు 85 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఫోలేట్, ఇతర సమ్మేళనాలను కూడా అందిస్తాయి. అంతే కాకుండా శరీరానికి అవసరం అయిన పోషకాలను కూడా అందిస్తాయి.

Related News

Clove Benefits For Heart: లవంగాలతో గుండెకు మేలు.. ఇలా వాడితే బోలెడు బెనిఫిట్స్

Yogamudrasana: యోగముద్రాసన.. ఒత్తిడి పారిపోవాల్సిందే!

Indians Sperm Count: భారతీయులకు గుడ్ న్యూస్.. స్పెర్మ్ కౌంట్‌లో మనవాళ్లు తగ్గేదెలే

Raisins Soaked Milk: పాలు, ఎండు ద్రాక్ష కలిపి తింటే.. ఆశ్చర్యకర లాభాలు !

7 Days Skin Care: గ్లోయింగ్ స్కిన్ కావాలా ? 7 రోజులు ఈ టిప్స్ అవ్వండి చాలు !

Diabetes:షుగర్.. ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా ?

Honey Health Benefits: ఆరోగ్యానికి తీపి చిట్కా.. ఒక చెంచా తేనెతో చలికాలం సమస్యలన్నీ దూరం!..

Big Stories

×