Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే శ్రీ లీల నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీ లీల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీ లీల తన పెళ్లి గురించి కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
శ్రీ లీల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన పెళ్లి ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. ముఖ్యంగా తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఈ సందర్భంగా తెలియజేశారు. నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ మంచి వ్యక్తి అయితే చాలని తెలిపారు. తనని బాగా అర్థం చేసుకొనే వ్యక్తి తనకు భర్తగా రావాలని తెలిపారు. అయితే ఆయన పూర్తిగా నా సినీ కెరియర్ కు మద్దతుగా నిలిచి నన్ను ప్రేమతో చూసుకోవాలని, సరదాగా ఉండే వ్యక్తి కావాలని తెలిపారు. వీటన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీ గల వ్యక్తి అయితే చాలని తెలిపారు.
ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి తనకు ఎదురుపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానంటూ ఈ సందర్భంగా శ్రీ లీల పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇటీవల తెలుగులో సినిమాలను కాస్త తగ్గించిన శ్రీ లీల ఇలా సినిమాలు తగ్గించడానికి గల కారణాలను కూడా తెలిపారు. తాను ఏదైనా ఒక సినిమాలో నటిస్తే తన పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం కాకూడదని కోరుకుంటాను. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసే అవకాశం వస్తే కచ్చితంగా తాను సినిమాలలో నటించడానికి సిద్ధమేనని వెల్లడించారు.
బాలీవుడ్ హీరో ప్రేమలో శ్రీ లీల?
ఇలా శ్రీ లీల పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని మాలో ఉన్నాయి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీల బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో ప్రేమలో ఉన్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు . ఇక ఈమె కార్తీక్ ఇంట్లో జరిగే కార్యక్రమాలలో కలిసి కనిపించడం ఇద్దరు కలిసి జంటగా బయట తిరగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్తీక్ ఆర్యన్ తల్లి మా ఇంటికి వచ్చే కోడలు డాక్టర్ అయితే చాలు అంటూ ఈమె చెప్పడంతో వీరి లవ్ రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్లేనని అభిమానులు భావిస్తున్నారు . ఇప్పటివరకు ఈ వార్తలపై శ్రీ లీల ఎక్కడ స్పందించలేదు.
Also Read: Darshan: దర్శన్ కు మరణశిక్ష విధించిన సమ్మతమే.. మా బాధ పట్టించుకోండి!