Darshan: కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు దర్శన్ (Darshan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దర్శన్ మరో నటి రేణుక స్వామి(Renuka Swamy) హత్య కేసులో భాగంగా అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. ఇలా గత కొంతకాలంగా జైలు జీవితం గడుపుతున్న ఈయనకు బెయిల్ వచ్చినట్టే వచ్చి తిరిగి ఆ బెల్ రద్దు కావడంతో ఇంకా జైలులోనే ఉన్నారు. అయితే దర్శన్ కు బెయిల్ కోసం ఆయన తరుపు న్యాయవాదులు కోర్టులో పోరాటం చేస్తున్న నిరాశ ఎదురవుతుంది.
తాజాగా ఈయన కేసు విషయంలో మరోసారి విచారణ జరిగినప్పటికీ కోర్టు నుంచి అనుకూలంగా తీర్పురాని నేపథ్యంలో దర్శన తరపు న్యాయవాది అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా దర్శన్ కి మరణ శిక్ష విధించిన మాకు సమ్మతమే అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి . నేడు ఈ కేసు విచారణలో భాగంగా దర్శన తరపు న్యాయవాదులు ఈ హత్య కేసులో త్వరగా విచారణ జరిపి దర్శన్ కు మరణశిక్ష విధించిన మాకు సమ్మతమే.. కానీ ఈ కేసును పొడిగించవద్దని తెలిపారు. దర్శన్ కు జైలులో కనీస సౌకర్యాలు కూడా లేవని మరోసారి ఈయన తరపు న్యాయవాదులు గుర్తు చేశారు.
ఇప్పటికే జైలులో ఈయనకు ఇవ్వాల్సిన సౌకర్యాలు గురించి కోర్టుకు ఎన్నోసార్లు పిటీషన్లు అందచేసాము అదేవిధంగా సుమారు 20 సార్లు బెయిల్ పిటిషన్ అందజేసినప్పటికీ కోర్టు వాటిని తిరస్కరిస్తూ వస్తుందని లాయర్లు వాదన వినిపించారు. జైలులో దర్శన్ ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గతంలో లాయర్లు కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కనీసం ఆయనకు దిండు దుప్పటి కూడా ఇవ్వలేదని ఇతరులు వాడినవి ఇవ్వటం వల్ల ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని కూడా లాయర్లు తెలిపారు.
బెయిల్ రద్దు చేసిన కోర్టు..
ఈ విధంగా దర్శన్ కు జైలులో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలోనే ఈ కేసును మరింత పొడిగించకుండా ఆయనకు మరణశిక్ష విధించిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో కోర్టు వాదనలను విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసి అక్టోబర్ 29వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మరి అక్టోబర్ 29వ తేదీ విచారణలో భాగంగా దర్శనకు అనుకూలంగా తీర్పు వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. రేణుక స్వామి హత్య కేసులో భాగంగా దర్శన్ తో పాటు పవిత్ర గౌడ్ ఇంకా 19 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది దర్శన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే కొద్దిరోజుల తర్వాత దర్శన్ కు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ అనంతరం మద్యంతర బెయిల్ రద్దు చేయడంతో దర్శన్ తిరిగి జైలుకు వెళ్లారు అప్పటినుంచి ఈయన బెయిల్ కోసం పోరాటం చేస్తున్న ఇప్పటివరకు బెయిల్ మంజూరు అవ్వలేదు.