Shreyas Iyer ICU: భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పక్కటెముక ప్రాంతంలో గాయమైంది. బ్యాక్ వర్డ్ పాయింట్ లో వేగంగా వెనక్కి పరిగెత్తుతూ క్యాచ్ అందుకున్న శ్రేయస్.. ఆ సమయంలో నేలపై పడిపోయాడు.
Also Read: Rohit – Kohli: ఆస్ట్రేలియాలో కోహ్లీ, రోహిత్ శర్మ చివరి మ్యాచ్.. బోరున ఏడ్చేసిన కామెంటేటర్
డైవ్ చేస్తున్న సమయంలో అతని మోచేయి పక్కటెముకలను బలంగా నెట్టింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ అక్కడే నొప్పితో విలవిల్లాడాడు. దీంతో జట్టు సహాయక సిబ్బంది వెంటనే శ్రేయస్ అయ్యర్ ని ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ లో శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి గాయమైనట్లు తేలింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శ్రేయస్ అయ్యర్ కి తగిలింది మామూలు గాయం కాదు!
ఇది సాధారణ గాయం కాదు. అతడు ఐసీయూ {ICU} లో చేరి చికిత్స పొందే స్థాయిలో జరిగిందని.. ప్రాణాంతకంగా మారినట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ కి ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రిబ్స్ లో అతనికి గాయమై రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. కడుపులోని ఎడమవైపు పై భాగంలో ఉండే స్ప్లీన్ {ప్లీహము, తిల్లి} అవయవానికి గాయమైనట్లు సిడ్నీ వైద్యులు గుర్తించారు. ఆ అవయవం నుండి రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు తేల్చారు. బ్లీడింగ్ వల్ల జరిగే ఇన్ఫెక్షన్ ని అడ్డుకునేందుకు ఐసీయూ చికిత్స తప్పనిసరి అని వైద్యులు పేర్కొన్నారు. అయితే శ్రేయస్ అయ్యర్ {Shreyas Iyer} 3 వారాల విశ్రాంతి తీసుకుంటాడని మొదట భావించారు. కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్న కారణంగా పూర్తిగా కోల్పోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం వారం రోజుల తరువాతే శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత్ కి రావచ్చని వైద్యులు సూచించారు.
Also Read: IPL 2026: కేకేఆర్ ప్లాన్ మాములుగా లేదు… ముగ్గురు డేంజర్ ప్లేయర్లను దించుతున్నారుగా !
అసలు శ్రేయస్ అయ్యర్ కి ఏమైందంటే..?
ఎడమవైపు ఎగువ ప్రాంతంలో పక్కటెముకల వద్ద ఉండే SPLEEM {ప్లీహమ్} అవయవానికి తీవ్ర గాయమైంది. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్ కి దారితీసింది. దీంతో సాధారణంగా ప్లీహమ్ చేసే రక్త కణాల శుద్ధి, బ్లడ్ సెల్స్ స్టోరేజ్, పాత రక్త కణాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకు శ్రేయస్ అయ్యర్ {Shreyas Iyer} కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయం అయిన వెంటనే శ్రేయస్ అయ్యర్ ని ఆసుపత్రికి తరలించకుండా అజాగ్రత్త వహించి ఉంటే ప్రాణాంతకంగా మారేదని సిడ్నీ వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రేయస్ అయ్యర్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలని క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.