సాధారణంగా ఇంట్లో వాష్ రూమ్స్ ను ఎవరైనా నీట్ గా ఉంచుకుంటారు. ఆఫీస్ లో కూడా ఫర్వాలేదు. ఎక్కడో ఒకచోట మాత్రమే సరిగా మెయింటెయిన్ చేయరు. కానీ, పబ్లిక్ టాయిలెక్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే, అంత మంచిది. ముక్కు బద్దలయ్యేలా ఉన్నా, వెళ్లకతప్పని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేరళ స్టార్టప్ కంపెనీ అయిన స్టార్టప్ ఫ్రుగల్ సైంటిఫిక్ క్రేజీ యాప్ ను రూపొందించింది. దాని పేరు KLOO App. ఇది త్వరలో ప్రయాణికులు, కేరళలోని సాధారణ ప్రజలకు దగ్గరలోని శుభ్రమైన రెస్ట్ రూమ్ ను కనుగొనడానికి సాయపడుతుంది. KLOO App అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా శుభ్రమైన రెస్ట్ రూమ్ ను గుర్తించే అవకాశం ఉంటుందని కేరళ మంత్రి MB రాజేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
KLOO App ద్వారా హోటళ్ళు, రెస్టారెంట్లు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించి శుభ్రమైన రెస్ట్ రూమ్ ల వివరాలను ఇందులో పొందుపరుస్తారు. వినియోగదారులు ఈ యాప్ ద్వారా రియల్ టైమ్ లొకేషన్ వివరాలు, ఆపరేషనల్ అవర్స్, నీట్ నెస్ రేటింగ్ ను ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. “ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా వాష్ రూమ్ కు వెళ్లొచ్చు” అని మంత్రి రాజేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రకృతి పిలిచినప్పుడు, ఇకపై శుభ్రమైన రెస్ట్ రూమ్ ను కనుగొనాల్సిన అవసరం లేదు. కేరళలో ఎక్కడైనా KLOO యాప్ మిమ్మల్ని దగ్గరగా ఉన్న శుభ్రమైన రెస్ట్ రూమ్ కు దారి చూపిస్తుంది.
ఇక ఈ యాప్ కు సంబంధించి కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్, సుచిత్వా మిషన్ ఈ యాప్ ను రూపొందించడానికి సహకరించాయి. ‘మాలినముక్తం నవకేరళం’ అంటే వ్యర్థ రహిత నూతన కేరళ ప్రాజెక్ట్ లో భాగంగా దీనిని తయారు చేశారు. వ్యాపార సంస్థలు పరిశుభ్రతకు సపోర్ట్ చేయడానికి, వినియోగదారులు రెస్ట్ రూమ్ లను కనుగొనడానికి, ఆ ప్రాంతంలోని రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో అందించే సౌకర్యాలు లాంటి అదనపు సమాచారాన్నితెలుసుకునేందుకు సహకరిస్తుంది.
Read Also: కార్వాన్ కాంపెన్ To క్యాంప్ ఫైర్ విత్ తంబోలా.. ఒక్కసారైనా ఈ క్రేజీ ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిందే!
KLOO యాప్ త్వరలో Ios, Android ఫోన్లలో అందుబాటులోకి రానున్నట్లు మంత్రి MB రాజేష్ వెల్లడించారు. ఈ నెల చివరిలోగా స్టే చేయడానికి అవసరమైన ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో రెస్ట్ రూమ్ లకు సంబందించి రియల్ టైమ్ వివరాలను తెలుసుకునే అవకాశం ప్రయాణికులకు, ప్రజలకు కలుగుతుందన్నారు. ఈ యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన వాష్ రూమ్ లను తెలుసుకుని ఉపయోగించుకోవచ్చన్నారు.
Read Also: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?