Trolls on Ramya Moksha:అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వీడియోలు చేస్తూ ఒక మోస్తారు పేరు దక్కించుకున్న వీరు.. అలేఖ్య చిట్టి పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఒక కస్టమర్ అడిగిన తీరుకు.. ఈ సిస్టర్స్ ఇచ్చిన సమాధానం వీరిపై భారీ స్థాయిలో నెగెటివిటీని పెంచేసింది. పచ్చళ్ళు కొనాలి అంటే లక్షల సంపాదించాలి అనే రేంజ్ లో వీరు చేసిన కామెంట్లు అందరి చేత ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి.
ఇకపోతే అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అక్కాచెల్లెళ్లలో ఒకరైన రమ్యకి బిగ్ బాస్ సీజన్9 హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. సీజన్ 9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన రమ్య.. కచ్చితంగా రెండు వారాలు మాత్రమే హౌస్ లో ఉండి బయటకు వచ్చేసింది. హౌస్ లోకి వచ్చిన మొదట్లోనే కంటెస్టెంట్స్ మధ్య లేనిపోని అనుమానాలు రేకెత్తించి,ఇటు చూసే ఆడియన్స్ కి కూడా చిరాకు తెప్పించింది. అంతేకాదు ఈమె హౌస్ లోకి వచ్చిన తర్వాత దాదాపు బంధాలు కూడా చెడిపోయాయి అనే వార్తలు వ్యక్తమయ్యాయి. పైగా తనూజను టార్గెట్ చేసుకొని చేసిన కామెంట్లకు అభిమానులు తట్టుకోలేకపోయారు. ఈమె ఓవరాక్షన్ చూసి ఎలాగైనా హౌస్ నుంచి బయటకు పంపించేయాలి అని గట్టి ప్రయత్నాలు చేసిన ఆడియన్స్ ప్రయత్నం ఫలించింది. రెండు వారాలలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది రమ్య మోక్ష.
ALSO READ:Bigg Boss 9 Trolls: ఇదెక్కడి రోస్ట్ మామా.. ఏకంగా పెళ్లి కూడా చేసేసారుగా?
ఇలా హౌస్ నుంచి బయటకు రావడంతో భారీగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. విషయంలోకి వెళ్తే.. వీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు ఎలాంటి ప్లాన్స్ వేశారు అనే విషయాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే
. అయితే వాటిని ఇప్పుడు యూజ్ చేసుకొని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే రమ్య కి హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలియడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లు సుమ , అలేఖ్య కూడా స్టేజ్ పైకి ఎవరు రావాలి? హౌస్ లోకి ఎవరు రావాలి అని లెక్కలు వేసుకోవడం మనం చూడవచ్చు. ఇక దానిని బేస్ చేసుకుని ఈ మాత్రం దానికి ఇన్ని లెక్కల అవసరమో.. పాపం పచ్చళ్ల పాప ఎన్ని కలలు కంది.. అన్ని బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే రమ్య మోక్షకి ట్రోలర్స్ చుక్కలు చూపిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన ట్రోలింగ్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రమ్య మోక్ష విషయానికి వస్తే.. ఈమె జిమ్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతేకాదు ఈమె కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది.
?utm_source=ig_web_copy_link