Pooja Hegde: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు గోల్డెన్ లెగ్ గా మారతారో.. ఎవరు ఎప్పుడు ఐరెన్ లెగ్ అవుతారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు స్టార్ గా కొనసాగిన వారే ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆలాంటి హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు. బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా అమ్మడు నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఎప్పుడెప్పుడు ఈ చిన్నది ఒక హిట్టు అందుకుంటున్న అని అటు అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది.
ఇండస్ట్రీకి వచ్చి పూజా పదేళ్లు అయిపోయింది కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ భామ ప్రస్తుతం పరాజయాలతోనే జీవనం సాగిస్తుంది. రాధ శ్యామ్, ఆచార్య, బీస్ట్ సర్కస్, కీసీకా భాయ్.. కిసీకా జాన్, దేవా, రెట్రో ఇలా అమందు ఏది ముట్టుకున్నా కూడా ప్లాపే వచ్చింది. అయినా కూడా ఈ చిన్నది అధైర్యపడలేదు. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయి అని ముందుగానే తెలుసుకొని అన్నింటిని బ్యాలెన్సుడ్ గా మెయింటైన్ చేస్తుంది.
ఇక మూడేళ్ల తర్వాత పూజా తెలుగులో స్ట్రైట్ గా ఒక సినిమా చేస్తుంది. రవి నేల కుదుటి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక తెలుగు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాప నే పూజా ఆశలను పెట్టుకుంది.
దుల్కర్ సినిమా ఎలా ఉంటుంది అనేది చెప్పడం కష్టం. అందుకే పూజా మరో వైపు ఐటెంసాంగ్స్ తో బిజీ అవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఈ చిన్నది మూడు ఐటెం సాంగ్స్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకుంది. రంగస్థలం, ఎఫ్ 3, కూలీ సినిమాల్లో పూజా ఐటెంసాంగ్స్ యే హైలైట్ అని చెప్పాలి. మోనికా సాంగ్స్ ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో ఉందన్న విషయం అందరికీ తెల్సిందే. ఇక తాజాగా అమ్మడు మరో స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఇది కనుక హిట్ అయితే అమ్మడి రేంజ్ మారిపోతుంది. ఈ లెక్కన పూజా ఐటెంసాంగ్స్ కే పరిమితమవుతుందా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్ కన్నా ఒక్క స్పెషల్ సాంగ్ కే డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. దీనికి హిట్, ప్లాప్ అనేది ఉండద. రావాల్సిన అటెన్షన్ కూడా వస్తుంది. అందుకే పూజా ఎక్కువ స్పెషల్ సాంగ్స్ మీద ఫోకస్ చేసిందని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్ అనగానే పూజా తడుముకోకుండా ఎస్ చెప్తుందని టాక్. మరి ముందు ముందు అమ్మడు హీరోయిన్ గా కంటే ఐటెంగర్ల్ గానే కనిపిస్తుందేమో చూడాలి.