Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమిత బైజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రేమలు మూవీతో యూత్ క్రష్ గా మారిపోయింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి బిజీగా మారింది. తాజాగా ఈ అమ్మడు కోలీవుడ్ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమాలో జోడి కట్టింది. ఆ మూవీ కూడా సక్సెస్ అవ్వడంతో ఈమె ఖాతాలో వరుసగా హిట్ సినిమాలు పడ్డాయి.. ప్రస్తుతం మమిత చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు. అదే ఒక్క సినిమాతో సినీ కెరియర్కు పుల్ స్టాప్ కూడా పెట్టవచ్చు. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయినా వాళ్లలో ఇప్పుడు డ్యూడ్ బ్యూటీ మమిత బైజు చేరింది.. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లకు చమటలు పట్టిస్తుంది ఈ కుర్ర బ్యూటీ. ఇప్పటికే సూర్య, విజయ్ సినిమాల్లో నటిస్తున్న మమితా.. కోలీవుడ్ స్టార్ ధనుష్ సరసన నటించే అవకాశం దక్కించుకుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలోనే ఉంది. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ముద్దుగుమ్మ మాత్రం వరుస ప్రాజెక్టులను చేతిలో పెట్టుకుంటూ బిజీగా గడుపుతుంది.
Also Read : రీతూ పై రమ్య షాకింగ్ కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ..
ప్రస్తుతం ప్రతి ఒక్క ఇండస్ట్రీలో వినిపించే పేరు మమిత బైజు.. ఒక్కో హిట్ సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది. రీసెంట్ గా డ్యూడ్ చిత్రంలో నటించి యూత్ క్రష్ గా మారింది. సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో ఈమెతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు రష్మిక మందన్నకు ఇలాంటి పోటీ ఉండేది. కానీ ఇప్పుడు మమితకు అలాంటి పోటీ కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కచ్చితంగా రష్మిక స్థానాన్ని కొట్టేస్తుందని నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న మూవీ, అలాగే జన నాయగన్, తమిళ రీమేక్ భగవంత్ కేసరి మూవీలో నటిస్తుంది. మలయాళంలో ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ అనే సినిమాలో మమిత నటించనుంది.. విష్ణు విశాల్, మమిత జంటగా నటించిన ‘ఇరందు వానం’ అనే తమిళ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయని టాక్..