Parakamani Case: టీటీడీ పరకామణిలో చోరీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు సీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు దర్యాప్తుకు గడువు విధించింది. దీంతో ఈ కేసులో తీగలాగితే డొంక కదలనుంది. అప్పటి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
పరకామణిలో చోరీ కేసు కొత్త మలుపు
టీటీడీ పరకామణిలో చోరీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు వ్యవహారం మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశించింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కి ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా రవికుమార్, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారి పేరుమీదున్న ఆస్తులు బదలాయించారా? లేదా అనేది కూడా విచారణ చేయనుంది.
రంగంలోకి ఏసీబీ-సీఐడీ
లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చిన అప్పటి టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై లోతుగా విచారణ చేయాలని అందులో ప్రస్తావించింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్ల కిందట తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై 2023లో టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు అందింది.
అందులో పని చేసిన ఉద్యోగి రవికుమార్ పెద్దఎత్తున పరకామణి నిధులు కొల్లగొట్టారని ప్రధాన సారాంశం. అప్పటి టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్‌లో రాజీ చేయించారు. ఈ వ్యవహారంపై చివరకు న్యాయస్థానానికి చేరింది. రీసెంట్‌గా ఈ కేసు విచారణ కాపీని న్యాయస్థానానికి సీఐడీ అందజేసింది. దీంతో సోమవారం హైకోర్టు, సీఐడీ-ఏసీబీకి విచారణను అప్పగించింది.
ALSO READ: మొంథా తుపాను.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
న్యాయస్థానం తీర్పుపై టీటీడీలో అప్పటి ఉద్యోగులు, బోర్డులో కీలకంగా వ్యవహరించినవారికి టెన్షన్ మొదలైంది. ఈ కేసులో సీఐడీ తమను అరెస్టు చేస్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ వ్యవహారాన్ని బయట పెట్టినందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన కంటితడి పెట్టారు కూడా.
టీటీడీ పరకామణిలో చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు..
సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని ఆదేశాలు
డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలన్న న్యాయస్థానం
నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి కోర్టు ఆదేశాలు
లోక్ అదాలత్‌లో రాజీ కుదిర్చిన న్యాయమూర్తి,… pic.twitter.com/pFYS9sSD9g
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2025