Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి పెళ్లి చేసేందుకు మిస్సమ్మలోకి ప్రవేశించిన ఆరు ఆత్మ చాలా హడావిడిగా స్పీడుగా మనోహరి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మనోహరికి నలుగు పెట్టేందుకు దగ్గరుండి మరీ బయటకు తీసుకెళ్తుంది. బయట ఎవరి చేత ముందు నలుగు పెట్టించాలని మిస్సమ్మ ఆలోచిస్తుంటే.. ఎవరో ఎందుకు నువ్వే ముందు నలుగు పెట్టు అంటూ అమర్ చెప్తాడు.
పార్థు, రాథోడ్ కూడా మిస్సమ్మనే ముందుగా నలుగు పెట్టమని చెప్తారు. మిస్సమ్మ నలుగు పెడుతుంటే.. అంజు తాను నలుగు పెట్టొచ్చా అని అడిగితే.. తప్పకుండా పెట్టొచ్చు అంజు రా అంటూ అంజు చేత మనోహరి నలుగు పెట్టిస్తుంది. బుజ్జమ్మ కూడా తాను నలుగు పెడతానంటే సరే అంటుంది మిస్సమ్మ. తర్వాత అక్కడకు వచ్చిన అతిథులు, చుట్టాలు ఒకరి తర్వాత ఒకరు నలుగు పెడుతుంటారు. అంతా చూస్తున్న అమర్ ఒక్కసారి పక్కకు రమ్మని మిస్సమ్మను పిలుస్తాడు. మిస్సమ్మ అమర్ వెనకాలే వెళ్తుంది.
మిస్సమ్మ పక్కకు వెళ్లగానే.. అమర్ ఆమె చేతులు పట్టుకుని ఎమోషనల్ అవుతూ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తుంటాడు. మిస్సమ్మ కూడా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుండిపోతుంది. అమరే థాంక్స్ భాగీ అంటాడు. ఎందుకని మిస్సమ్మ అడిగితే మనోహరి పెళ్లి దగ్గరుండి ఇంత గ్రాండ్‌గా చేయిస్తున్నావు అంటాడు. అది నా బాధ్యత కదండి మనోహరి పెళ్లి చేస్తానని ఆశ్రమంలో మాటిచ్చాను కదా అంటుంది. మిస్సమ్మ మాటలకు అమర్ షాక్ అవుతాడు. మనోహరి పెళ్లి గురించి నువ్వు మాటివ్వడం ఏంటి..? అని అడిగితే..
అదేంటండి అక్కా మాట నా మాట కాదా..? అక్క మాటిచ్చింది. నేను చేస్తున్నాను.. అందుకే అలా అన్నాను అంటూ మిస్సమ్మ చెప్పగానే.. అమర్ ఎమోషనల్ అవుతూ.. మిస్సమ్మను హగ్ చేసుకుంటాడు. ఆరు దూరం చేసుకుని నేను దురదృష్టవంతుడిగా మిగిలిపోయానేమో అనుకున్నాను.. కానీ నిన్ను పెళ్లి చేసుకుని అదృష్టవండిగా మారిపోయాను అంటాడు. మిస్సమ్మ కూడా తన మనసులో తానే ఆరు అన్న విషయం చెబితే ఏడుస్తాడేమో అమర్ అనుకుంటూ మౌనంగా ఉండిపోతుంది.
నువ్వు ఎంతో బాధ్యాతయుతంగా మనోహరి పెళ్లి చేస్తున్నావు.. అందుకే నీకు థాంక్స్ చెప్పడానికే పక్కకు రమ్మన్నాను అంటాడు అమర్.. ఈ మాత్రం దానికే థాంక్స్ చెప్పాలా..? అంటూ మిస్సమ్మ చెప్తుంటే.. అమర్‌కు ఫోన్ వస్తుంది పక్కకు వెళ్లి కాల్ మాట్లాడుతుంటాడు. అప్పుడే బయట నుంచి రాథోడ్ లోపలికి వస్తాడు.
లోపలికి వెళ్లిన రాథోడ్ మిస్సమ్మను మేడం నలుగు పెట్టడం అయిపోయింది నువ్వు వస్తే మంగళస్నానాలు చేయిస్తారట. అని చెప్పగానే.. ఆయన నన్ను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ భాగీని మెచ్చుకున్నాడు రాథోడ్ అని మిస్సమ్మలో ఉన్న ఆరు ఆత్మ చెప్పగానే.. రాథోడ్ కూడా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంటాడు. అంతా దూరం నుంచి వింటున్న అమర్ దగ్గరకు వస్తాడు. అమర్ దగ్గరకు రావడం గమనించిన రాథోడ్ మిస్సమ్మకు సైగ చేస్తాడు. మిస్సమ్మ సైలెంట్ అవుతుంది. అమర్ దగ్గరకు వచ్చి ఏంటి రాథోడ్ ఇవాళ కొత్తగా భాగీని మేడం అని పిలుస్తున్నావు అని అడగ్గానే.. అంటే మనం ఉన్నప్పుడు మిస్సమ్మ అంటాను సార్ బయట వాళ్ల ముందు మేడం అని పిలుస్తాను.. ఇవాళ అందరూ ఉన్నారు కదా అని రాథోడ్ చెబితే..
ఇక్కడ బయటి వాళ్లు ఎవ్వరూ లేరు కదా..? అని అమర్ అడిగితే.. ఇవాళ మేడం మేడం అంటూ పిలిచి అలాగే పిలుపు వచ్చేసింది సార్.. బయట మంగళ స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు వెళ్దాం పదండి ముందు అంటాడు రాథోడ్. అమర్ మాత్రం ఏంటి మిస్సమ్మ నేను కూడా నిన్ను మేడం అని పిలవొచ్చా అని అడుగుతాడు. పిలవాలని ఉంటే పిలవండి అంటుంది మిస్సమ్మలోని ఆరుంధతి ఆత్మ. తర్వాత ముగ్గురు కలిసి బయటకు వెళ్తారు. బయట అందరూ మనోహరికి మంగళ స్నానాలు చేయిస్తుంటారు. మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.